Facebook : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్.. 7 గంటలు నిలిచిపోయినందుకు ఎన్ని కోట్లు నష్టమో తెలిస్తే మీకు షాక్..!
Facebook : ప్రజెంట్ సొసైటీలో సోషల్ మీడియా ఓ విప్లవంలా మారింది. ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో అకౌంట్స్ కలిగి ఉండటంతో పాటు అందులో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇకపోతే అతిపెద్ద సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్ దాని అనుంబంధ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. ఒక్కరోజులో కేవలం గంటల పాటు ఈ మాధ్యమాల సర్వీసులు నిలిచిపోతే భారీ నష్టం కలిగినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ సేవలు ఆగిపోవడంతో యూజర్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా సమాచార వ్యవస్థ అనేది స్తంభించినంత పని అయిపోయింది. ఈ క్రమంలోనే ఇలా జరగడానికి సైబర్ అటాక్ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా సర్వీసులు గంటల పాటు నిలిచిపోవడం ఫేస్‌బుక్ హిస్టరీలోనే అతి పెద్ద వైఫల్యమని, దీని వల్ల ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ వ్యక్తిగత సంపదకు కూడా నష్టం కలిగింది. ఫేస్ బుక్ సంస్థ గంటల వ్యవధిలోనే రూ.వేల కోట్లు నష్టపోగా, ఫేస్ బుక్ ఓనర్ జుకర్ బర్గ్ బిలీయనీర్ల జాబితా నుంచి కిందకు వచ్చేశాడు. సోమవారం రాత్రి 9 గంటల నుండి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు నిలిచిపోయాయి. దాంతో కస్టమర్స్ కొన్ని గంటల పాటు ఇబ్బుందులకు గురయ్యారు.
Facebook : బిలీయనీర్ జాబితా నుంచి దిగజారిపోయిన మార్క్ జుకర్ బర్గ్..
7 గంటల తర్వాత అనగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి వాట్సాప్ సేవలను రిస్టోర్ చేశారు. ఫేస్‌బుక్ మెయిన్ ఆఫీసులో వచ్చిన టెక్నికల్ ఇష్యూ వల్ల సేవలు ఇలా నిలిచిపోయాయని తెలుస్తోంది. అయితే, సేవలను రిస్టోర్ చేసినట్లు జుకర్ బర్గ్ ప్రకటించారు. కానీ, అంతరాయానికి గల కారణాలను మాత్రం తెలపలేదు. నష్టం అంచనా దాదాపుగా 7 బిలియన్ డాలర్లని పేర్కొంటున్నారు. ఇండియన్ మనీలో రూ.52 లక్షల కోట్లు. ఇకపోతే ఈ అంతరాయం వల్ల ఫేస్ బుక్ షేర్స్ కూడా పడిపోయాయి. మొత్తంగా వారాల వ్యవధిలోనే సుమారు 140 బిలియన్ డాలర్లను జుకర్ బర్గ్ నష్టపోయాడు. సేవలకు కలిగిన అంతరాయానికి మార్క్ జుకర్ బర్గ్ క్షమాపణ చెప్పాడు. అయితే, జరిగిన నష్టాన్ని ఆయన ఎలా పూడ్చుకుంటాడు అనేది ఆసక్తికరం.