YS Jaganmohan Reddy : నవరత్నాలను మించిన పథకం అమలు చేయబోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jaganmohan Reddy : నవరత్నాలను మించిన పథకం అమలు చేయబోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :12 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jaganmohan Reddy : నవరత్నాలను మించిన పథకం అమలు చేయబోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి..!

YS Jaganmohan Reddy : 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘ నవరత్నాలు ‘ అనే అంశాన్ని ఎక్కువగా హైలెట్ చేశారు. మిగతా అంశాల కన్నా నవరత్నాలు అనే అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ తొమ్మిది హామీలను వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అమలు చేసి తీరుతామని వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన ప్రజలు ఆయనకే ఓటు వేసి సీఎంను చేశారు. పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఎక్కువగా వైయస్ జగన్ ఈ తొమ్మిది అంశాలను ఎక్కువగా హైలెట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ అందించిన ఈ అంశాలను ఉపయోగించుకొని వైఎస్ జగన్ ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రశాంత్ కిషోర్ అమలు చేసిన ఈ తొమ్మిది అంశాలను వైయస్ జగన్ అమలు చేశారు. వీటితోపాటు మరికొన్నింటిని కూడా అమలు చేశారు. అలాగే ఈ నవరత్నాలను వైయస్ జగన్ తన మేనిఫెస్టోలో తెలియజేశారు.

ఇక ఇప్పుడు వైయస్ జగన్ పాలనతో కొందరు సంతృప్తి చెందారు. మరికొందరు అసంతృప్తి చెందారు. కొందరు మళ్లీ సీఎం గా వైయస్ జగన్ వస్తారని అంటున్నారు. మరికొందరు రారు అని చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో నవరత్నాల నుంచి ఎలాంటి అంశాలను తీసుకువస్తే మళ్లీ గెలవగలము అనే కాన్సెప్ట్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీగా ఎవరికి పనిచేయడం లేదు. తనని తాను ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైయస్ జగన్ కష్టపడుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ కి సంబంధించిన బృందం ఇప్పటికీ వైయస్ జగన్ తో కలిసి పని చేస్తున్నారు. ఈ బృందంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాచ్ వైయస్ జగన్ కి సంబంధించిన క్వార్టరీ వాళ్లు నవరత్నాల నుంచి ఏదైనా తీసుకువస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు.

ఫిబ్రవరి చివరిలోగా నోటిఫికేషన్ తీసుకువస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటివరకు ఇస్తున్న నవరత్నాలు కొనసాగిస్తునే మరో మూడు ముఖ్య అంశాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు. అందులో మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. త్వరలో ‘ సిద్ధం ‘ సభ ముగియనుంది. ‘ ఆడుదాం ఆంధ్రా ‘ ప్రోగ్రాం లలో వైయస్ జగన్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురానున్నారు. మొదటగా వైఎస్ జగన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ తో రిపోర్ట్స్ కూడా సేకరించారని సమాచారం. ఇక రెండవది రైతులకు రుణమాఫీ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఇక మూడవది ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారట. వీటికి మూడు వజ్రాలు అని పేరు పెట్టి ప్రజల్లోకి తీసుకురావాలని వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారట.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది