venkateshwara swamy : సల సల కాగే నీళ్లు విగ్రహంపై పడగానే చల్లగా.. దేవుడి మహిమ.. వైరల్ వీడియో..!
venkateshwara swamy : భక్తి భావన భారతీయుల్లో చాలా బలంగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశీయులు భారతీయులను చూసినపుడు వీరు దైవనమ్మకంతో దేన్నైనా సాధించగలుగుతారు అని చెప్తుంటారని పలువురు పేర్కొంటుడటం మనం చూడొచ్చు. మొత్తంగా భక్తి భావన అనేది ప్రజల విశ్వాసం. భిన్న మతాలున్నప్పటికీ దేవుడిపై విశ్వాసం ఒక్కటిగానే ఉంటుంది.
venkateshwara swamy నీళ్లు విగ్రహంపై పడగానే చల్లగా
కర్నాటక రాష్ట్రంలోని రాయచూరులో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేరు గాంచిన టెంపుల్. ఇక్కడకు భక్తులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. కాగా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. వెంకటేశ్వర స్వామి విగ్రహంపై బాగా మరిగే వేడి నీళ్లతో అభిషేకం చేస్తే ఈ నిరు క్షణాల్లోనే చల్లగా అవుతాయట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
స్వామి వారి విగ్రహంపైన అభిషేకం సందర్భంగా పూజారి నీరు పోయగానే కిందకు వచ్చే సరికి చల్లబడతాయట. ఇక నీటిని స్వామి వారి పాదాల వద్ద పోస్తే మాత్రం తిరిగి సెగలు వచ్చి వేడిగా అవుతాయట. అయితే, ఇదంతా కూడా దేవుడి మహిమ అని స్థానికులు చెప్తున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో దేవుడి విగ్రహంలో ఉండే ప్రత్యేకత వల్ల ఇలా జరుగుతుందని మరికొందరు అంటున్నారు.