Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 28 July 2024, 1:00 pm
  •  Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే... మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!

Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తాగటం వలన మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలో జీర్ణక్రియ అనేది జరగడం కోసం కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే మనం భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వలన ఆ రసాయనాల గడత అనేది తగ్గి మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోవటం వలన జీర్ణ ఎంజైమ్ లు అనేవి దెబ్బతింటాయి. అప్పుడు ఇది గ్యాస్టిక్ సమస్యలను కలిగిస్తుంది. అయితే జీర్ణ క్రియ కు లాలాజలం అనేది చాలా అవసరం. అలాగే భోజనం టైంలో నీళ్లు తీసుకోవడం వలన మీ లాలాజలం అనేది ఎంతో పల్చగా మారుతుంది. సాధారణంగా భోజనంతో పాటుగా నీళ్లను తీసుకోవడం వలన బరువు పెరగటం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాక భోజనం మధ్యలో నీరు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలహీనంగా తయారవుతుంది…

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే... మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

భోజనం మధ్యలో నీటిని తీసుకోవటం వలన శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు కూడా ఎంతగానో పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే భోజనం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవడం వలన బరువు కూడా తొందరగా పెరుగుతారు అని అంటున్నారు. దీనివలన ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత నీళ్లను తీసుకోవడం వలన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణ వ్యవస్థ తీసుకొనె టైం ను నీళ్లు తీసుకోవడం ద్వారా మార్చేస్తున్నట్లు లెక్క. దీంతో ఊహించిన దానికన్నా ముందుగానే ఆకలి అనేది వేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp