Water : బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Water : బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా…!!

Water : సాధారణంగా ఎంతో మంది ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లను తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగితే మరి కొంతమంది మాత్రం బ్రష్ చేయక ముందే తాగుతూ ఉంటారు. అయితే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా. బ్రష్ చేయకుండా నీళ్లు తాగటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయో లేదో చూద్దాం… రాత్రి పడుకొని ఉదయం లేచిన తర్వాత నోటి నిండ క్రిములు మరియు బ్యాక్టీరియా […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,8:00 am

Water : సాధారణంగా ఎంతో మంది ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లను తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగితే మరి కొంతమంది మాత్రం బ్రష్ చేయక ముందే తాగుతూ ఉంటారు. అయితే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా. బ్రష్ చేయకుండా నీళ్లు తాగటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయో లేదో చూద్దాం… రాత్రి పడుకొని ఉదయం లేచిన తర్వాత నోటి నిండ క్రిములు మరియు బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అవి పళ్ళపై మరియు నాలుకపై పేర్కొని ఉంటాయి.

మీరు లేవగానే నోటిని శుభ్రం చేయకుండా ఆహారం తిన్న మరియు నీళ్లు తాగిన అవి శరీరంలోనికి ప్రవేశిస్తాయి. దీంతో ఎన్నో రకాల వ్యాధులు మిమ్మల్ని ఎటాక్ చేస్తాయి. అలాగే పళ్ళు కూడా దెబ్బ తింటాయి. కానీ నీటిని మాత్రం తాగొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఉదయం లేవగానే ఒక గ్లాస్ లేక రెండు గ్లాస్ ల నీటిని తీసుకోవడం వలన శరీరం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు అని అంటున్నారు…

ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకోకుండా నీళ్లు తాగటం వలన శరీరం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ మరియు మలినాలు బయటకు పోతాయి. అంతేకాక మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో కూడా ఇమ్యూనిటీ పవర్ ఎంతగానో పెరుగుతుంది. అయితే మీరు పరిగడుపున నీళ్లు తాగితే చర్మ సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చర్మానికి సహజమైన మెరుపు కూడా వస్తుంది. అయితే సాధారణ నీరు మాత్రమే కాదు గోరువెచ్చని నీళ్లు తాగిన కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది