Batukamma : కేసీఆర్‌ను బతుకమ్మ పాటతో కడిగిపారేసిన మహిళలు.. ‘కళా’త్మక నిరసన.. వైరల్ వీడియో
Batukamma : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ‘కళా’త్మక నిరసన తెలిపారు మహిళలు. బుధవారం పెత్రమావాస్య సందర్భంగా మహిళలు ‘నోటిఫికేషన్లు ఉయ్యాలో.. నోటి మూటలాయే ఉయ్యాలో… నిరుద్యోగ భృతి ఉయ్యాలో.. నోటి మూటాలాయే ఉయ్యాలో.. రైతు రుణమాఫీ ఉయ్యాలో.. ఖాతాలేని కూతలో ఉయ్యాలో.. కేజీ టు పీజీ అనే ఉయ్యాలో.. ఉచిత విద్య లేకపాయే ఉయ్యాలో.. దళిత బంధు అనే ఉయ్యాలో..
దగా చేయబట్టే ఉయ్యాలో.. బంగారు తెలంగాణ ఉయ్యాలో.. బట్టేబాజ్ మాటలాయే ఉయ్యాలో’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ మహిళలు పాట పాడుతున్నారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించిన పాటను బతుకమ్మ సందర్భంగా విడుదల చేయగా..
మరో వైపున టీఆర్ఎస్ ప్రభుత్వాన్నిబతుకమ్మ పాట రూపంలో విమర్శిస్తుండటం గమనార్హం. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఈ బతుకమ్మ పాట ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. బుధవారం నుంచి పూల సింగిడి షురూ కానున్న సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు జరిగే ప్రకృతి పండుగ ‘ఎంగిలి పూల’తో స్టార్ట్ అవుతోంది.
కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు.#Bathukamma pic.twitter.com/vknnt4yXZo
— Share Telangana (@ShareTelangana) October 6, 2021