Mahaboobnagar..బతుకమ్మ చీరలొచ్చేశాయ్..
మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతీ ఏడాది తెలంగాణ రాష్ట్రసర్కారు ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా చీరలు అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తొలివిడతగా 1.68 లక్షల చీరలు మహబూబ్ నగర్ జిల్లాలోని మహిళా సమాఖ్య భవనానికి రీచ్ అయినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
ఫుడ్ సెక్యురిటీ కార్డు కలిగి ఉండి 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ ఈ బతుకమ్మ చీరలను అధికారులు అందజేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పండుగ ముందర చీరలను ఇంటింటికీ వెళ్లి మరి పంపిణీ చేయనున్నారు. కాగా, చీరలు అందజేయడం పట్ల కొందరు చీరల క్వాలిటీ పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలా శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా కొంత మంది నేతన్నలు ఆదుకున్నట్లు అవుతుందని, వారికి పని కల్పించినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.