Guntur.. 644వ రోజుకు అమరావతి రైతుల దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 644వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జిల్లాలోని తుళ్లూరు మండల పరిధి గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ సెక్రెటేరియట్‌తో పాటు పలు భవనాలు నిర్మించగా, ప్రస్తుతం వైసీపీ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 644వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జిల్లాలోని తుళ్లూరు మండల పరిధి గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ సెక్రెటేరియట్‌తో పాటు పలు భవనాలు నిర్మించగా, ప్రస్తుతం వైసీపీ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికేంద్రీకరణే లక్ష్యంగా ఏపీలో మూడు రాజధానులు ఉండాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉంటుందన్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం అమరావతిలో భూములిచ్చిన రైతులు ఈ నిర్ణయం ద్వారా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే వారు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు.