MS Dhoni : ధోని, సాక్షిల లవ్ స్టోరి, మ్యారేజ్‌కు కారణం ఈ క్రికెటరే అంటా..?
MS Dhoni : మిస్టర్ కూల్..మహేంద్ర సింగ్ ధోని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు పదహారేళ్ల పాటు టీమిండియాకు విశేషమైన సేవలు అందించిన ధోని.. గతేడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి ధోని క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. ధోని ముందర, ధోని తర్వాత అనేంతలా క్రికెట్‌పైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఎం.ఎస్.ధోని లైఫ్‌లో ఆయనకు ఓ క్యూట్ ‘లవ్ స్టోరి’ కూడా ఉంది. అయితే అది ఎవరితోనో కాదండోయ్… ఆయన వైఫ్ సాక్షి సింగ్‌తోనే..
‘ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరి’ చిత్రంలో చూపించిన మాదిరిగా ధోని, సాక్షి మధ్య పరిచయం చిన్నప్పటి నుంచి ఉంది. వీరిద్దరు చిన్ననాటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. సాక్షి ఫాదర్, ధోని ఫాదర్ ఒకే కంపెనీలో ఉద్యోగులు కాగా ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అయితే కొన్నాళ్ల తర్వాత సాక్షి ఫ్యామిలీ డెహ్రాడూన్‌కు షిఫ్ట్ అయింది. అలా వీరు కొద్ది రోజుల పాటు విడిపోయారు. అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత ధోనీని కోల్‌కత్తాలోని తాజ్ బెంగాల్ హోటల్‌లో కలిసింది సాక్షి. సాక్షి అందానికి, మాట చతురతకు పడిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, తాజ్ బెంగాల్ మేనేజర్ యుదజిత్ దత్తా నుంచి నెంబర్ తీసుకునిఆమెకు సందేశాలు పంపారట.
MS Dhoni : సాక్షి, ధోని చిన్న ‘నాటి’ మిత్రులు..
అయితే, సాక్షి సింగ్ వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండు నెలలకు సాక్షి ధోని బర్త్ డే వేడుకలకు హాజరైంది. ఆ సమయంలో బైక్‌పైన సాక్షిని ఇంటి దగ్గర దిగబెట్టిన సమయంలో ధోని లవ్ ప్రపోజ్ చేయగా, కొంత సమయానికి యాక్సెప్టెన్స్ వచ్చేసింది. 2010లో సంప్రదాయబద్ధంగా సాక్షి, ధోని మ్యారేజ్ జరిగింది. ధోనికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా సాక్షినే ఇస్తుంటుంది. ఇకపోతే సాక్షి, ధోని లవ్ మ్యాటర్, పెళ్లి సందర్భంగా చాలా సార్లు వీరిరువురు కలవడానికి హెల్ప్ చేసిన ఆ వ్యక్తి కూడా క్రికెటరే కావడం గమనార్హం. ఆయన ఎవరంటే.. టీమిండియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప. తమను కలిపినందుకుగాను సాక్షి చాలా సార్లు రాబిన్‌కు థాంక్స్ చెప్పింది.