Nagarjuna : హీరోయిన్స్‌తో రొమాన్స్‌పై.. నాగార్జున నోట ఊహించని మాటలు..!
Nagarjuna : తెలుగు చిత్ర సీమకు రెండు కళ్ల లాంటి వారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. అని చెప్పనక్కర్లేదు. ఈ సంగతి అందరికీ విదితమే. అటువంటి ఫ్యామిలీ నుంచి హీరోలు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి సక్సెస్ అయ్యారు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా, బిజినెస్ మ్యాన్‌గా నాగార్జున రాణిస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఆయన నటించిన ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున ఊహించని విధంగా మాట్లాడారు.
నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ పిక్చర్ ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్స్ పాల్గొంటున్నారు. ఈ క్రమలోనే నాగార్జున ఓ నేషనల్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఊహించని విధంగా సమాధానాలిచ్చారు నాగార్జున. ఇంతకీ నాగార్జున్ ఏం అన్నాడంటే..

nagarjuna interesting comments on romance with heroines
Nagarjuna : సంక్రాంతి కానుకగా.. ‘బంగార్రాజు’.. బ్లాక్ బాస్టర్ గ్యారెంటీ..!
టాలీవుడ్ సినిమాల్లో హీరోలు మహిళలు వెంటపడి వేధిస్తారని, దీనిని రొమాన్స్ అని అంటుంటారని దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్ నాగార్జునను అడిగారు. కాగా, ఈ క్వశ్చన్‌కు నాగార్జున రిప్లయి ఇచ్చారు. అదంతా ట్రాన్స్ లేషన్ మిస్టేక్ వల్ల వచ్చిన సమస్యని, తెలుగు భాషలో కథానాయిక గురించి అభివర్ణిస్తూ రాసిన సాంగ్ లిరిక్స్‌ను ఇంగ్లిష్ భాషలోకి అనువదస్తే అవి బూతు పదాలుగా మారుతాయని నాగార్జున చెప్పాడు.
అలా ‘బంగార్రాజు’ సినిమాలోని ఓ పాట లిరిక్స్‌ను ఇంగ్లిష్ భాషలోకి అనువదిస్తే కనుక అది ఈ రోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్ వచ్చేలా ఉంటుందని వివరించాడు నాగార్జున. అలా హీరోయిన్స్ రొమాన్స్‌పై నాగార్జున వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ ఫిల్మ్ పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇందులో నాగచైతన్యకు జోడీగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి నటించింది.