Huzurabad : హుజురాబాద్ .. టీఆర్ఎస్ ఓటమికి కారణం ఇతనట.. !
Huzurabad : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అయినప్పటికీ నియోజకవర్గ ఓట్లరు టీఆర్ఎస్ పార్టీని బలపరిచినట్లు కనబడటం లేదు. ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల కౌంటింగ్ రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం ఉండటం గమనార్హం. కాగా, టీఆర్ఎస్ ఇమేజ్‌ను దెబ్బతీయడంలో ఈటలతో పాటు ఈ వ్యక్తి కూడా పోటీపడ్డాడు. అతనెవరంటే..
Huzurabad : రోటీమేకర్ ఎఫెక్ట్.. అధికార పార్టీని దెబ్బ తీసిన శ్రీకాంత్..
ప్రజా ఏక్తా పార్టీ తరఫున హుజురాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబడిన సిలివేరు శ్రీకాంత్‌కు ఎన్నికల సంఘం రోటీ మేకర్ గుర్తు కేటాయించింది. ఆ గుర్తు కారును పోలి ఉండటంతో ప్రజలు ఆ గుర్తుకు ఓటేయడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్కాల్సిన ఓట్లన్నీ కూడా రోటీ మేకర్‌కు పడటంతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం క్రమంగా పెరిగింది. అలా అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమికి సిలివేరు శ్రీకాంత్ కారకుడయ్యాడు. ప్రజా ఏక్తా పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీకాంత్‌తో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పోటీ పడటం గమనార్హం. ఒకటో రౌండ్ నుంచి రెండో రౌండ్ వరకు వచ్చేసరికి రోటీ మేకర్ ఓట్లు పెరుగుతూ వచ్చాయి.
అలానే పరిస్థితులు చివరి వరకు కొనసాగితే కనుక సిలివేరు శ్రీకాంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమికి కారకుడవుతాడనే చెప్పొచ్చు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ ఇవ్వడం గమనార్హం. హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, సిలివేరు శ్రీకాంత్‌కు 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 220 ఓట్లు రాగా, సిలివేరు శ్రీకాంత్‌కు 158 ఓట్లు వచ్చాయి. అలా రౌండ్లు పెరిగే కొద్ది రోటీమేకర్‌కు ఓట్లు పెరుగుతున్నాయి. ఐదో రౌండ్ ముగిసే కాంగ్రెస్‌కు 812 ఓట్లు వస్తే, ప్రజాఏక్తా పార్టీ సింబల్ రోటీ మేకర్‌కు 469 ఓట్లు వచ్చాయి. మొత్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కారు ఓటమికి రోటీ మేకర్ కారణమవుతుందని చెప్పొచ్చు.