PM Modi : భారత్ శక్తి ఏంటో చూపించాం.. ఇది ప్రజా విజయం.. ప్రధాని మోదీ
PM Modi : ఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ల ద్వారా ప్రపంచానికి భారత్ శక్తి ఏంటో చూపించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వంద కోట్ల కొవిడ్ టీకాల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఈ ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇది భారతావని విజయం. వంద కోట్ల డోసులు అనేది సంఖ్య కాదని.. దేశ సంకల్ప బలం అన్నారు.కరోనా మహమ్మారి భారత్‌కు అతిపెద్ద సవాలే విసిరిందన్నారు. అయినప్పటికీ మహమ్మారిని విజయవంతంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చి చరిత్రను సృష్టించినట్లు తెలిపారు. భారత విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయన్నారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా వ్యాక్సిన్ మన నినాదమన్నారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందించామన్నారు.ప్రతిఒక్కరూ భారతదేశాన్ని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు. కానీ భారతదేశ ప్రారంభ స్థానం భిన్నంగా ఉందని గుర్తుంచుకోవాలని ప్రధాని అన్నారు. ఇతర దేశాలు ఎంతోకాలంగా ఔషధాలు, టీకాల తయారీలో పాల్గొంటున్నాయి. భారత్ తన ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు అందించగలదా అని అంతా ప్రశ్నించారు. 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణే ఇందుకు సామాధానమని దీంతో విమర్శకులు సైలెన్స్ అయ్యారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్లు రూపొందించినట్లు తెలిపారు.
PM Modi : ఫార్మా హబ్‌గా భారత్..
100 కోట్ల మందికి టీకాలు వేశాం. అది కూడా ఉచితంగా. ప్రపంచంలో ఫార్మా హబ్‌గా భారత్ స్థానం మరింత పదిలమైందని ప్రధాని అన్నారు. దేశం తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందన్నారు. భారీ లక్ష్యాలను ఎలా సాధించాలో తెలసిన దేశం భారత్ అన్నారు. టీకాల పంపిణీలో బిలియన్ మైల్‌స్టోన్‌ను అందుకోవడం అద్భుత అధ్యాయమన్నారు. ఇది నూతన భారత్‌కు ప్రతిబింబమని తెలిపారు.అక్టోబర్ 21వ తేదీ నాటికి దేశంలో 18 ఏళ్లు దాటినవారిలో 75 శాతం మందికి ఒక డోసు.. 31 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ జరిగింది. చైనా తర్వాత ఒక బిలియన్ కొవిడ్ -19 టీకాల మైలురాయి మార్కును చేరుకున్న రెండవ దేశంగా భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించింది.