Guppedantha Manasu 7 Dec Today Episode : అసలు రిషి ఎక్కడికి వెళ్లాడు? రిషిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? చంపేశారా? వసుధార ఎందుకు అంత టెన్షన్ పడుతోంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 7 Dec Today Episode : అసలు రిషి ఎక్కడికి వెళ్లాడు? రిషిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? చంపేశారా? వసుధార ఎందుకు అంత టెన్షన్ పడుతోంది?

Guppedantha Manasu 7 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 7 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 940 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను కూల్ గా ఉన్నానా? అలా కనిపిస్తున్నానా నీకు. వసుధార బయటికి కనిపిస్తోంది. నేను కనిపించడం లేదు. నా మనసులో వంద ప్రశ్నలు తిరుగుతున్నాయి. అసలు రిషికి ఏమైంది. ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని. దాని గురించే ఉదయం నుంచి […]

 Authored By gatla | The Telugu News | Updated on :7 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  ధరణికి ఫోన్ చేసిన వసుధార

  •  మహీంద్రాను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన అనుపమ

  •  రవీంద్రా ఏం ఆలోచిస్తున్నాడు అని టెన్షన్ పడ్డ దేవయాని

Guppedantha Manasu 7 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 7 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 940 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను కూల్ గా ఉన్నానా? అలా కనిపిస్తున్నానా నీకు. వసుధార బయటికి కనిపిస్తోంది. నేను కనిపించడం లేదు. నా మనసులో వంద ప్రశ్నలు తిరుగుతున్నాయి. అసలు రిషికి ఏమైంది. ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని. దాని గురించే ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను అంటే.. ఇలా ఆలోచిస్తూ ఉంటే కాదు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వండి. వాళ్లు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటుంది అనుపమ. పోలీస్ స్టేషన్ లో ఏమని ఫిర్యాదు ఇవ్వాలి. నా కొడుకు తప్పిపోయాడని ఇవ్వాలా? వాడేం చిన్నపిల్లాడు కాదు అంటాడు మహీంద్రా. ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఒక్కోసారి తను బయటికి వెళ్లి రెండు మూడు రోజుల వరకు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు అని అంటాడు మహీంద్రా. మీ దగ్గర జగతి లేని టైమ్ లోనే అలా జరిగి ఉంటుంది అని అంటుంది అనుపమ. జగతి ఉంటే అలా రిషి అంత ఈజీగా వెళ్లనిచ్చేది కాదు అని అంటుంది అనుపమ. జగతి ఉన్నప్పుడు రిషి కోసం తను పడిన తాపత్రయం చూసి ఉంటే ఒక తల్లి బిడ్డ కోసం ఎంతలా తాపత్రయపడిందో చూసేవాడివి అంటుంది అనుపమ. అప్పుడంటే ఓకే కానీ.. ఇప్పుడు పెళ్లి అయింది కదా. ఇప్పుడు కూడా ఇలా చేస్తే ఎలా. భర్త కోసం భార్య ఎదురు చూస్తూనే ఉంటుంది. వసుధారను చూడు ఎంత టెన్షన్ పడుతోందో అంటుంది అనుపమ. నా మాట విను.. కంప్లయింట్ ఇద్దాం అంటుంది అనుపమ. కనిపించకుండా పోయింది నా కొడుకు. తన విషయంలో ఎలా ఉండాలి అనేది నాకు తెలుసు అంటాడు మహీంద్రా.

ఈ రాత్రి వరకు ఆగుదాం అంటాడు మహీంద్రా. ఏమంటావు వసుధార అంటే మీ ఇష్టం మామయ్య అంటుంది వసుధార. దీంతో అనుపమ.. నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. చాలా ధైర్యంగా మాట్లాడుతుంటావు. ఎలాంటి సిచ్యుయేషన్స్ లో అయినా చాలా పాజిటివ్ గా మాట్లాడుతావు. కానీ.. ఇప్పుడు ఇలా బిక్క మొహం వేసుకొని ఉండటం నాకు నచ్చడం లేదు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నేను కూడా రిషి కూడా వెతుకుతాను. ఏం టెన్షన్ పడకు అని వసుధారకు ధైర్యం చెబుతుంది అనుపమ. అయినా కూడా వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు రిషి ఎక్కడికి వెళ్లాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషి సార్ నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లరు. కానీ.. వెళ్లారు. అసలు సార్ ఏ పని మీద వెళ్లారు. ఎవరిని కలవడానికి వెళ్లి ఉంటారు. అసలు సార్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. రిషి సార్.. హాస్పిటల్ కి వెళ్లి ఉంటే.. ఒకసారి ధరణి మేడమ్ కి ఫోన్ చేసి కనుక్కుందాం అని ధరణికి ఫోన్ చేస్తుంది. రిషి సార్ అక్కడికి ఏమైనా వచ్చారా అని అడుగుతుంది. దీంతో రిషి ఇక్కడికి రాలేదు వసుధార అంటుంది ధరణి. అసలు రిషి ఎక్కడికి వెళ్లాడు అంటే ఏమో తెలియదు మేడమ్. ఫోన్ కూడా కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది వసుధార.

Guppedantha Manasu 7 Dec Today Episode : రిషి ఏమయ్యాడు అని ఆరా తీసిన అనుపమ

మరోవైపు అనుపమ.. ఎవరికో కాల్ చేసి రిషి గురించి ఆరా తీస్తుంది అనుపమ. మీరు హాస్పిటల్ కు వెళ్లినా కూడా రిషి కనిపించలేదు అంటే.. నేను ఫోన్ చేసిన టైమ్ కి కూడా రిషి మీదగ్గర లేడు అంటే.. శైలేంద్ర మీద అటాక్ కి, రిషి కనిపించకుండా పోవడానికి సంబంధం ఉందా? అని అడుగుతుంది. కానీ.. మహీంద్రా ఏం మాట్లాడడు. ఏ విషయం అయినా కూడా కొంచెం ముందు వెనుక ఆలోచించి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అంటాడు.

మరోవైపు రవీంద్ర దగ్గరికి వెళ్లిన దేవయాని.. ఏం ఆలోచిస్తున్నారు అంటే.. నాకు ఏం అర్థం కావడం లేదు. ఎలా ఉండాల్సిన కుటుంబం ఎలా అవుతోంది అని అంటాడు. కొన్నాళ్లు రిషి ఇంట్లో లేకుండా ఉండిపోయాడు. ఇప్పుడు వచ్చాడు. ఇంతలో జగతి చనిపోయింది. ఇప్పుడు మళ్లీ శైలేంద్రపై దాడి జరిగింది. శైలేంద్ర తప్పు చేశాడని వాయిస్ వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు రవీంద్రా.

కట్ చేస్తే తెల్లవారుతుంది. ఉదయం మహీంద్రా లేచి చూసేసరికి వసుధార కనిపించదు మహీంద్రాకు. ఇంతలో అనుపమ వస్తుంది. రిషి కూడా ఇంకా ఇంటికి రాలేదు అంటాడు. వసుధారకు ఫోన్ చేస్తాడు మహీంద్రా. దీంతో స్కూటీ మీద ఉన్న వసుధార బయటికి వచ్చాను అని చెబుతుంది. డ్రైవింగ్ లో ఉన్నా అని చెబుతుంది. నువ్వు కనిపించకపోయే సరికి బాగా టెన్షన్ అవుతోంది అంటాడు.

మరోవైపు ముకుల్.. మహీంద్రాకు కాల్ చేసి రిషి సార్ వచ్చాక నాకు కాల్ చేయమని చెప్పా కదా. ఇంకా నాకు రిషి ఎందుకు కాల్ చేయలేదు అని అడుగుతాడు ముకుల్. దీంతో ఇంకా రిషి ఇంటికి రాలేదు అని చెబుతాడు మహీంద్రా. మరోవైపు వసుధార రోడ్డు అంతా చెక్ చేస్తుంది. కానీ.. రిషి జాడ దొరకదు. లెక్చరర్స్ కు కూడా ఫోన్ చేసి అడుగుతుంది. కానీ.. తెలియదు అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది