Guppedantha Manasu 2 Dec Today Episode : శైలేంద్ర మీద నిజంగానే అటాక్ జరిగిందా? శైలేంద్ర ఆడుతున్న నాటకమా? రిషి ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 2 Dec Today Episode : శైలేంద్ర మీద నిజంగానే అటాక్ జరిగిందా? శైలేంద్ర ఆడుతున్న నాటకమా? రిషి ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు?

Guppedantha Manasu 2 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 2 డిసెంబబర్ 2023, శనివారం ఎపిసోడ్ 936 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శైలేంద్ర మీద నిజంగానే అటాక్ జరిగిందా అని వసుధారతో మహీంద్రా అంటాడు. ఏమో తెలియదు మామయ్య.. ధరణి మేడమ్ అలాగే చెప్పింది కదా అంటుంది వసుధార. వాడు ఇలాంటి విషయాల్లో దిట్ట కదా.. వాడు ఏదైనా చేయగలడు. నాకెందుకో వాడి […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  శైలేంద్రపై నిజంగానే అటాక్ జరిగిందా?

  •  శైలేంద్రకు బ్లడ్ ఇచ్చిన మహీంద్రా

  •  రిషి ఎక్కడికి వెళ్లాడని టెన్షన్ పడ్డ వసుధార

Guppedantha Manasu 2 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 2 డిసెంబబర్ 2023, శనివారం ఎపిసోడ్ 936 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శైలేంద్ర మీద నిజంగానే అటాక్ జరిగిందా అని వసుధారతో మహీంద్రా అంటాడు. ఏమో తెలియదు మామయ్య.. ధరణి మేడమ్ అలాగే చెప్పింది కదా అంటుంది వసుధార. వాడు ఇలాంటి విషయాల్లో దిట్ట కదా.. వాడు ఏదైనా చేయగలడు. నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది. వాడి క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే కదా. వాడు తన స్వార్థం కోసం అందరి నాశనం కోరుకునేవాడు. అలాంటి వాడు ఇలా చేయడానికి ఎందుకు వెనకాడుతాడు అని అంటాడు మహీంద్రా. ఒకవేళ ఇది కావాలని శైలేంద్ర చేయిస్తే అంత కంటే పిచ్చి పని ఇంకోటి ఉండదు మామయ్య అంటుంది వసుధార. ముకుల్ దగ్గర శైలేంద్ర వాయిస్ ఉంది. అప్పుడు ఖచ్చితంగా శైలేంద్ర వాయిస్ పట్టుకొని ముకుల్ వస్తారు. అప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు అని అంటుంది వసుధార. ఇంతకీ రిషి ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటారు. వాడు ఏదో పని మీద వెళ్లి ఉంటాడు అని అనుకుంటారు. ముందు వెళ్లి ధరణితో మాట్లాడుదాం అని అంటాడు మహీంద్రా. నా కోసం రా అమ్మ అంటాడు మహీంద్రా.

ఆసుపత్రిలో ధరణితో మాట్లాడుతారు మహీంద్రా, వసుధార. అటాక్ చేసింది ఎవరు అని అడుగుతాడు మహీంద్రా. నాకు తెలియదు అని అంటుంది ధరణి. వాళ్లను ఎప్పుడైనా చూశావా అంటే లేదు మామయ్య అంటుంది ధరణి. ఆయన మంచిగా మారడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కావచ్చు. ఇప్పుడు ఇలా జరిగిపోయింది. రక్తం మడుగులో పడిపోయారు మామయ్య. ఆయన ఇదివరకు శైలేంద్ర అయితే మనం అనుమానించవచ్చు కానీ.. ఆయన ఇదివరకు శైలేంద్ర కాదు. ఆయన పూర్తిగా మారిపోయారు అంటుంది ధరణి. మరోవైపు డాక్టర్ వచ్చి శైలేంద్రకు బ్లడ్ పోయిందని తనకు వెంటనే బ్లడ్ ఎక్కించాలని అంటారు డాక్టర్. మీకు తెలిసిన వాళ్లకు ఎవరికైనా ట్రై చేసి త్వరగా బ్లడ్ ఏర్పాటు చేయండి అంటాడు డాక్టర్. దీంతో వెంటనే రవీంద్ర రక్తం కోసం కొందరికి ఫోన్ చేస్తాడు. ఆ మూర్ఖుడికి బ్లడ్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నయ్య అని మనసులో మహీంద్రా అనుకుంటాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు. బ్లడ్ ఎక్కడా అరేంజ్ కావడం లేదు అంటాడు రవీంద్ర. దీంతో బ్లడ్ సమయానికి ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటాడు డాక్టర్. అయ్యో దేవుడా.. ఇప్పుడు నా కొడుకును కాపాడేది ఎవరు అని అంటుంది దేవయాని.

Guppedantha Manasu 2 Dec Today Episode : శైలేంద్రకు బ్లడ్ ఇచ్చిన రవీంద్ర

దీంతో మహీంద్రా దగ్గరికి వెళ్లి నువ్వే నా కొడుకును కాపాడాలి. శైలేంద్రది నీది ఒకే బ్లడ్ గ్రూప్. నువ్వే రక్తం ఇచ్చి కాపాడాలి. ప్లీజ్ మహీంద్రా అని వేడుకుంటాడు రవీంద్ర. దీంతో మహీంద్రాకు ఏం చేయాలో అర్థం కాదు. అన్నయ్య అవేం మాటలు. నేను ఇస్తాను అన్నయ్య బ్లడ్ అంటాడు మహీంద్రా. మీరు బాధపడకండి అన్నయ్య. మీరు బాధపడితే నేను చూడలేను అంటాడు మహీంద్రా. శైలేంద్రది, నాది ఒకే బ్లడ్ గ్రూప్. ఎక్స్ ఛేంజ్ కూడా అవసరం లేదు అని అంటాడు మహీంద్రా.

తర్వాత వెళ్లి బ్లడ్ ఇస్తాడు మహీంద్రా. లోపల కళ్లు మూసుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. నువ్వు ఇన్నాళ్లు తప్పించుకున్నావు. ఇకపై నీ ఆటలు సాగవు. ఖచ్చితంగా నీ బండారం బయటపడే సమయం దగ్గర పడింది. నా కళ్ల ముందే నా కొడుకు చేతుల్లో నువ్వు చావు దెబ్బలు తినడం ఖాయం. ఈ మాటలన్నీ నువ్వు వింటున్నావని, నీ తలకు ఎక్కుతున్నాయని నాకు తెలుసురా అంటాడు మహీంద్రా.

ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతాడు రవీంద్రా. బాగానే ఉంది అన్నయ్య అంటాడు మహీంద్రా. మరోవైపు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్నే ఆసరాగా చేసుకొని ఆ శైలేంద్ర రెచ్చిపోతున్నారు అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లి రిషి కోసం ఎదురు చూస్తుంటుంది. సర్.. ఇంకా రాలేదు ఏంటి.. అసలు ఏ పని మీద వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు. ఒకవేళ ముకుల్ గారి దగ్గరికి వెళ్లి ఉంటారా అని అనుకుంటుంది వసుధార.

ఇంతలో అక్కడికి ముకుల్ వస్తాడు. సర్ లేరు కదా. తన దగ్గరికి వెళ్లలేదా.. లేక వెనుక వస్తున్నారా అని అనుకుంటుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని అడుగుతారు ముకుల్. దీంతో రిషి సార్ అని అంటుంటే.. లోపల రిషి సార్ లేరా అని అడుగుతాడు ముకుల్. లేరు.. బయటికి వెళ్లారు అంటుంది వసుధార.

నేను ఒకసారి శైలేంద్రను చూసి వస్తాను అని చెబుతుంది దేవయాని. దీంతో సరే.. చూసి వెంటనే వచ్చేయ్ అంటాడు రవీంద్ర. దేవయాని లోపలికి వెళ్తుంది. ఇంతలో ముకుల్ వస్తారు. శైలేంద్ర కండిషన్ ఎలా ఉంది అంటే.. ఇప్పుడే బ్లడ్ ఎక్కించారు అంటాడు రవీంద్ర. స్పృహలో ఉన్నాడా అంటే స్పృహలో లేడు అని అంటాడు రవీంద్ర. కానీ.. ఏం కాదు.. స్పృహలోకి వచ్చేట్టున్నాడు అంటాడు మహీంద్రా.

కానీ.. ఇప్పుడు వాడి కండిషన్ సరిగ్గా లేదు కదా. ఈ సమయంలో ఇంటరాగేషన్ అవసరమా? అంటాడు రవీంద్ర. దీంతో మీ కొడుకు అని వెనుకగడుగు వేస్తున్నారా అంటే.. అదేం లేదు. నా కొడుకు అయినా సరే తప్పు చేశాడని తెలిస్తే నేనే పోలీసులకు పట్టిస్తాను. నేను ఆ విషయంలో వెనక్కి తగ్గను అంటాడు రవీంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది