Guppedantha Manasu 20 Nov Monday Episode Highlights : అనుపమ మనసు మార్చేసిన దేవయాని.. వసుధార మీదికి అనుమానం వచ్చేలా చేసిన దేవయాని, శైలేంద్ర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 20 Nov Monday Episode Highlights : అనుపమ మనసు మార్చేసిన దేవయాని.. వసుధార మీదికి అనుమానం వచ్చేలా చేసిన దేవయాని, శైలేంద్ర

Guppedantha Manasu 20 Nov Monday Episode Highlights : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు 20 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 925 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుపమ డీబీఎస్టీ కాలేజీకి వెళ్తుంది. అక్కడ రిషి, వసుధారను కలవడం కోసం ప్రయత్నిస్తుంది. వాళ్ల గురించి కాలేజీ స్టాఫ్ ను అడుగుతుంది. మహీంద్రాను అడిగితే ఆయన కాలేజీకి సరిగ్గా రావడం లేదని […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  డీబీఎస్టీ కాలేజీకి వెళ్లిన అనుపమ

  •  అనుపమను చూసి శైలేంద్ర షాక్

  •  అనుపమను ఇంటికి తీసుకెళ్లిన శైలేంద్ర

Guppedantha Manasu 20 Nov Monday Episode Highlights : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు 20 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 925 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుపమ డీబీఎస్టీ కాలేజీకి వెళ్తుంది. అక్కడ రిషి, వసుధారను కలవడం కోసం ప్రయత్నిస్తుంది. వాళ్ల గురించి కాలేజీ స్టాఫ్ ను అడుగుతుంది. మహీంద్రాను అడిగితే ఆయన కాలేజీకి సరిగ్గా రావడం లేదని చెబుతాడు. దీంతో రిషి, వసుధారను కలిసి వెళ్దామని అనుకుంటుంది. ఇంతలో శైలేంద్ర తనను చూస్తాడు. ఈమె.. అనుపమ కదా. ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు శైలేంద్ర. వెంటనే దేవయానికి ఫోన్ చేసి తన ఫోటోను పంపించి ఈమె అనుపమ కదా అని అడుగుతాడు. దీంతో అవును.. అంటుంది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే.. తనను ఏం చేసి అయినా ఇంటికి తీసుకురా అని చెబుతుంది దేవయాని.

దీంతో తనతో మాట మాట కలుపుతాడు శైలేంద్ర. తను ఫణీంద్రా కొడుకును అని.. మహీంద్రా తనకు బాబాయి అని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత తన అమ్మకు ఫోన్ చేసి మాట్లాడమంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లు అనుపమ అని లేని ప్రేమను ఒలకబోస్తుంది దేవయాని. దీంతో అనుపమ నిజమే అనుకుంటుంది. తన నటనకు పడిపోతుంది. నువ్వు ఇంటికి వస్తే.. జగతి గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం అంటుంది దేవయాని. నిన్ను శైలేంద్ర తీసుకొస్తాడు అని చెబుతుంది దేవయాని. దీంతో సరే అంటుంది అనుపమ. జగతి గురించి ఏదైనా తెలుస్తుందేమో అని అనుకొని శైలేంద్రతో పాటు దేవయాని ఇంటికి వెళ్తుంది అనుపమ. అయితే.. రిషి, వసుధార అప్పుడే కాలేజీకి వచ్చినా వాళ్లను కలవనీయకుండా అడ్డుకొని ఇంటికి తీసుకెళ్తాడు శైలేంద్ర.

Guppedantha Manasu 20 Nov Monday Episode Highlights : జగతి గురించి పాజిటివ్ గా మాట్లాడిన దేవయాని

అనుపమ ఇంటికి రాగానే ఇక తన నాటకాన్ని ప్రారంభిస్తుంది దేవయాని. జగతి అంటే తనకు చాలా ఇష్టమని.. జగతి, మహీంద్రా మ్యారేజీని ముందు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత తాను కూడా ఒప్పుకున్నానని చెబుతుంది దేవయాని. అలా ఎలా మీ నిర్ణయాన్ని మార్చుకున్నారు అని అడుగుతుంది. దీంతో పరిస్థితులు మారుతుంటాయి కదా అంటుంది.

ఇంతలో ధరణి కాఫీ తీసుకొస్తుంది. దీంతో అనుపమకు కాఫీ ఇస్తుంది దేవయాని. ధరణి.. తను జగతి ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. తను నా కోడలు అంటుంది. ఈ కాలం పిల్ల అని కానీ.. ఒక వంద సంవత్సరాలు వెనక పుట్టి ఉండాల్సింది. అంత పద్ధతిగా ఉంటుంది. పెద్దలు అంటే చాలా గౌరవం అంటుంది. అస్సలు ఒక్క మాటకు కూడా ఎదురు సమాధానం చెప్పదు అంటుంది దేవయాని. దీంతో మీరు చెప్పిన మాట వింటుంది కాబట్టి మీకు నచ్చుతుందా అంటుంది అనుపమ.

దీంతో అలా కాదు అనుపమ.. చాలా మంది అమ్మాయి అని చెబుతున్నా అంటుంది దేవయాని. ఒకే మీకు పని కల్పించడం లేదు కాబట్టి మంచి అమ్మాయి అంటుంది అనుపమ. దీంతో లేదండి.. నిజంగానే మా ఆవిడ చాలా మంచిది అంటాడు శైలేంద్ర. సరే ధరణి నువ్వు వెళ్లి పని చూసుకో అంటుంది దేవయాని.

జగతికి కూడా ధరణి అంటే ఎంతిష్టమో అంటుంది దేవయాని. ఇంతలో అసలు జగతి ఎలా చనిపోయింది అని అడుగుతుంది అనుపమ. దీంతో ఏ రౌడీ ఎదవో రిషిని కాల్చబోతే.. రిషికి అడ్డుపడి తన ప్రాణాలు పోగొట్టుకుందట అని చెబుతుంది దేవయాని. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. అక్కడ స్పాట్ లో ఉంది ఆ ముగ్గురే అంటే ఎవరెవరు అని అడుగుతుంది అనుపమ. రిషి, వసుధార, జగతి అని అంటుంది.

అప్పుడే కాదు కదా మామ్.. అంతకు ముందు నుంచే రిషికి ప్రమాదాలు ఎదురవుతున్నాయి అంటాడు శైలేంద్ర. ఎప్పటి నుంచి అంటే.. ఎండీ సీటులో జగతి కూర్చున్నప్పటి నుంచి అంటే.. మీరు ఎప్పుడూ ఎండీ సీటు కావాలని అనుకోలేదా అని అడుగుతుంది అనుపమ. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు. నాకెందుకండి ఎండీ సీటు. అంత పెద్ద పదవులు నేను మోయలేను అంటాడు శైలేంద్ర. దీంతో ఎందుకు అనుకోవాలి.. ఎవరికైనా అంత ఆశ ఉంటుంది కదా అంటే.. నేను అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటాను అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది