Guppedantha Manasu 6 Nov Monday Episode Highlights : రిషికి తమ గురించి ఎక్కడ తెలుస్తుందో అని టెన్షన్ పడ్డ శైలేంద్ర, దేవయాని.. ముకుల్ ఈ కేసును ఛేదిస్తాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 6 Nov Monday Episode Highlights : రిషికి తమ గురించి ఎక్కడ తెలుస్తుందో అని టెన్షన్ పడ్డ శైలేంద్ర, దేవయాని.. ముకుల్ ఈ కేసును ఛేదిస్తాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :5 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  రిషికి అసలు దోషులు శైలేంద్ర, దేవయాని అనే విషయం తెలుస్తుందా?

  •  ముకుల్ గురించి మహీంద్రాకు చెప్పిన రిషి

  •  దేవయానికి రవీంద్ర వార్నింగ్

Guppedantha Manasu 6 Nov Monday Episode Highlights : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు 6 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 913 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ధరణిపై సీరియస్ అవుతాడు శైలేంద్ర. ఆ తర్వాత మన బండారం మొత్తం ముకుల్ గాడు బయటపెట్టేస్తాడు అంటుంది దేవయాని. రిషి గాడికి ఈ విషయం తెలిసినా మనిద్దరిని చంపేస్తాడు. పెద్దమ్మ అని కూడా చూడడు. అదే నిజం అయితే ఏంటి మన పరిస్థితి అంటుంది దేవయాని. నువ్వు టెన్షన్ పడకు మామ్. నేను చూసుకుంటాను అని చెబుతాడు శైలేంద్ర. మరోవైపు మహీంద్రాకు కాఫీ ఇస్తాడు రిషి. నిన్న ఇంటికి వెళ్లావు కదా ఏమైంది అంటే.. స్పెషల్ ఆఫీసర్ ముకుల్ ను తీసుకెళ్లి పెద్దమ్మ వాళ్లకు పరిచయం చేశాను డాడ్ అంటాడు రిషి. ఆ ముకుల్ అమ్మ స్టూడెంట్ అని చెబుతాడు రిషి. ఖచ్చితంగా ముకుల్ ఈ కేసును ఛేదిస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒక క్లూను పట్టుకుంటాడు. అతి త్వరలోనే నేరస్తులు ఎవరో తెలుస్తుంది డాడ్ అంటాడు రిషి. వాడెవడో తెలిశాక వాడికి శిక్ష వేయాలి అంటాడు మహీంద్రా. అమ్మను మనకు కాకుండా చేసిన వాళ్లను నామరూపం లేకుండా చేస్తాను. అమ్మ ప్రాణం పోవడానికి కారణమైన వాళ్లు తెలిసిన వెంటనే వాళ్లను మీ ముందే శిక్షిస్తాను అంటాడు రిషి. ఒకసారి మీరు ముకుల్ ను కలవండి డాడ్ అని అంటాడు రిషి.

మరోవైపు అనుపమ.. మహీంద్రాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ.. మహీంద్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అనుపమకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో పెద్దమ్మ వస్తుంది. ఎప్పుడు మహీంద్రా నాకు ఎదురు పడ్డాడో ఆ క్షణమే నా మెమోరీస్ మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. అప్పటి నుంచి నా మనసు నా మాట వినడం లేదు. ఎటు చూసినా.. ఏం చేసినా అవే ఆలోచనలు. నా గతం నన్ను ఒక పట్టాన ఉండనీయడం లేదు అంటుంది. అందుకే నువ్వు వాళ్లను కలువు అంటుంది పెద్దమ్మ. ఇప్పుడైనా ఆలోచించు అంటుంది పెద్దమ్మ. దీంతో సరే. నువ్వు చెప్పినట్టే నా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లాలనిపిస్తోంది అంటుంది. వెళ్తావా అంటే అవును పెద్దమ్మ అంటుంది. నేను కోల్పోయింది తిరిగి పొందాలని అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నా అంటుంది అనుపమ. నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు.. నువ్వు పడుతున్న బాధకు విముక్తి కలిగే వరకు నేను చెప్పినట్టు చేయి అంటుంది పెద్దమ్మ.

Guppedantha Manasu 6 Nov Monday Episode Highlights : దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రవీంద్ర

మరోవైపు దేవయానికి రవీంద్ర వార్నింగ్ ఇస్తాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చేయమని చెప్పా కదా అని ధరణితో చెబుతాడు రవీంద్ర. మీకు, మీ టాస్కులకు ఒక దండం. ఇకనైనా మీ టాస్కుల గోల ఆపండి అంటుంది దేవయాని.. నేను బాధలో ఉంటే మీరు ఇలా అంటున్నారు. రిషి ఇంట్లో లేకపోతే నాకు కూడా ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. రిషికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని బతిమిలాడితే వస్తా అన్నాడు. కానీ.. ఇలా ఎంక్వయిరీకి ఒక మనిషిని తీసుకొస్తాడని నేను అనుకోలేదు అంటుంది దేవయాని.

అసలు రిషి ఇలా మారిపోయాడు ఏంటి.. దీనికి కారణం మహీంద్రానే అంటుంది దేవయాని. దీంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుకు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు మహీంద్రా. నువ్వు ఇప్పటిదాకా చేసిన ఘనకార్యం చాలు. ఇక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వాళ్లు ఈ ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్లు ముందు మాట్లాడకు అంటాడు రవీంద్ర. నా తమ్ముడి గురించి నీకేం తెలుసు. తను ఎంత గొప్పవాడో తెలుసా? అంటూ ప్రశ్నిస్తాడు రవీంద్ర.

మరోవైపు రెడీ అయి బయటికి వస్తాడు రిషి. బయట ఉంటుంది వసుధార. ఏంటి ఇంత త్వరగా బయటికి వచ్చావు అని అడుగుతాడు రిషి. ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది కదా.. అందుకే లేట్ అవుతుందేమో అని బయటికి వచ్చాను. కానీ.. మళ్లీ ఎందుకో మీకోసం వెయిట్ చేయాలనిపించింది. అందుకే ఇక్కడే ఉన్నాను అంటుంది వసుధార. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది