Intinti Gruhalakshmi 11 Dec Today Episode : పరందామయ్య అనారోగ్యంపై తులసి, అనసూయకు టెన్షన్.. దివ్య కడుపు పోవాలని రాజ్యలక్ష్మి మరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : పరందామయ్య అనారోగ్యంపై తులసి, అనసూయకు టెన్షన్.. దివ్య కడుపు పోవాలని రాజ్యలక్ష్మి మరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1124 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రిపోర్ట్స్ లో ఏమున్నాయి. డాక్టర్లు ఏమన్నారు అంటే.. ఏం లేదు మామయ్య. ఊరికే రెగ్యులర్ వెరిఫికేషన్ అంటుంది తులసి. లేకపోతే ఒకసారి నాకు ఆ రిపోర్ట్స్ ఇవ్వు. నేనే చెక్  చేస్తా అంటే.. వద్దులే మామయ్య అంటుంది తులసి. మీరు […]

 Authored By gatla | The Telugu News | Updated on :11 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  తులసి అమ్మ చనిపోయిన విషయం మరిచిపోయిన పరందామయ్య

  •  దివ్య ఫంక్షన్ చేసి ఏదో ప్లాన్ చేయబోయిన రాజ్యలక్ష్మి

  •  తనకు ఈ ఫంక్షన్ వద్దని చెప్పేసిన దివ్య

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1124 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రిపోర్ట్స్ లో ఏమున్నాయి. డాక్టర్లు ఏమన్నారు అంటే.. ఏం లేదు మామయ్య. ఊరికే రెగ్యులర్ వెరిఫికేషన్ అంటుంది తులసి. లేకపోతే ఒకసారి నాకు ఆ రిపోర్ట్స్ ఇవ్వు. నేనే చెక్  చేస్తా అంటే.. వద్దులే మామయ్య అంటుంది తులసి. మీరు కొంచెం వీక్ గా ఉన్నారు అందుకే జాగ్రత్తగా చూసుకోమన్నారు డాక్టర్లు అని చెబుతుంది తులసి. దీంతో సరే అంటాడు పరందామయ్య. రేపే కదా కార్తీక పౌర్ణమి. రేపు ఉపవాసం ఉండాలి అంటుంది అనసూయ. దీంతో మీరు మీరు పూజ చేసుకోవడం కాదు ఆవిడను కూడా పిలవండి అంటాడు పరందామయ్య. ఎవరిని అంటే.. మీ అమ్మ అని అంటాడు పరందామయ్య. దీంతో తులసికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఒకసారి ఫోన్ ఇవ్వు అనసూయ. నేను మాట్లాడుతాను అంటాడు పరందామయ్య. దీంతో నేను పిలిచినా ఆమె రాదు అంటుంది అనసూయ. ఎందుకు అంటే మా అమ్మ ఎవరు పిలిచినా రాని లోకాలకు పోయింది అని అంటుంది తులసి. అయ్యో.. నాకు చెప్పనేలేదు. ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది.. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ పరందామయ్య అనడంతో తులసి ఇంకా బాధపడుతుంది.

మరోవైపు విక్రమ్ ను చూసి తమ ప్లాన్ ను స్టార్ట్ చేస్తుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న దివ్యకు. కాస్త తేరుకుందా అని అడుగుతుంది. టిఫిన్ తిన్నదా అని అడుగుతుంది. తన వెనుకే దివ్య కూడా వస్తుంది. తనను చూసి ఏంటి దివ్య అంత డల్ గా ఉన్నావేంటి అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. అవునురా.. ఇక్కడేమో మీ అమ్మ పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయడం గురించి ఆలోచిస్తోంది అని బసవయ్య అంటాడు. దీంతో ఫంక్షన్ ఎందుకు అంటే ఈ ఇంటికి వారసుడు రాబోతుంటే ఆమాత్రం ఫంక్షన్ చేయకపోతే ఎలా అంటుంది బసవయ్య భార్య. మొన్న మీ అమ్మ వారు ఏదో సారె పెట్టి తూతూ మంత్రంగా కానిచ్చారు. కానీ.. మనం మాత్రం అలా కాదు.. చాలా గ్రాండ్ గా చేయాలి అంటాడు బసవయ్య. అదేదో నీ నోటితోనే చెప్పు అక్కయ్య అంటాడు బసవయ్య. దీంతో మనం చెప్పాలా వాళ్లకు తెలియదా అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో ప్రియ కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చి అక్క ఇంకా నీరసంగా ఉంది. ఈ సమయంలో ఫంక్షన్ కరెక్ట్ కాదు బావ గారు ఆలోచించండి అంటుంది ప్రియ. ప్రియ విషయంలో అనుకోకుండా ఏదో పొరపాటు జరిగిపోయింది అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో విక్రమ్ తాతయ్య వచ్చి కావాలని చేసిన పని అది అంటాడు. దివ్య విషయంలో నా సంతోషాన్ని అందరితో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. తెలిసిన వాళ్లు అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇద్దామని నేను అనుకుంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : దివ్యకు ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేసిన రాజ్యలక్ష్మి

అయితే.. ఈ ఫంక్షన్ జరపడం నాకు ఇష్టం లేదు అంటుంది దివ్య. దీంతో అలా అనేశావేంటమ్మా.. అది మీ అత్త గారి కోరిక. కాదనకు అంటాడు బసవయ్య. దీంతో దివ్యకు ఇష్టం లేని పని ఏదీ జరగకూడదు అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యకు వడ్డానం చేయించాలని అనుకుంటున్నావా అల్లుడు అంటే.. తను పుట్టింటికి వెళ్తా అంటోంది అంటాడు విక్రమ్. నా మనసులో సంతోషాన్ని చంపుకొని నాకు కూడా పంపించాలని ఉంది. నా కోడలు లక్ష్మీదేవిలాగా నా కళ్ల ముందు ఉంటే చూస్తూ మురిసిపోతున్నాను. అందరికీ చెప్పుకొని తృప్తి పడుతున్నాను. ఈ టైమ్ లో తను వెళ్లిపోతే ఎలా అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది రాజ్యలక్ష్మి.

దివ్యను దగ్గరుండి ప్రేమగా చూసుకోవాలని నా మనసు కోరుకుంటోందిరా అంటుంది రాజ్యలక్ష్మి. వాళ్ల అమ్మ దగ్గరికి పారిపోతాను అంటే ఎలా చెప్పు అంటుంది. పారిపోతాను అనలేదు.. వెళ్తా అంటుంది అంటాడు తాత. దివ్యను పంపడానికి నాకు అయితే మనసు రావడం లేదు అంటుంది రాజ్యలక్ష్మి. నీకోసం ఈ కార్తీక మాసంలో ఉపవాసం కూడా ఉంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. విక్రమ్ నేను కూడా ఉపవాసం ఉంటాను అంటుంది దివ్య. దీంతో అయ్యయ్యో నువ్వు ఉండకూడదు అమ్మ. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ వి. బలమైన ఆహారం తీసుకోవాలి అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో లేదు.. నేను ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య. తనిష్టం అమ్మా ఉండనివ్వు అని చెప్పి విక్రమ్ వెళ్లిపోతాడు.

మరోవైపు అందరూ దీనంగా కూర్చొని ఉంటారు. ఫుల్లుగా తాగి వస్తాడు నందు. నందును చూసి ఛీ అంటుంది అనసూయ. ఎవరికైనా నా మీద కోపం రావచ్చు కానీ.. అమ్మవు. నీకు నా మీద కోపం రావడం ఏంటి. నేను ఏం తినడం లేదని పొద్దున బాధపడ్డావు కదా. ఇప్పుడు వడ్డించు నేను తింటాను అంటాడు నందు. నీకే అమ్మ చెప్పేది. వద్దు అంటే తినమంటావు. తింటాను అంటే పట్టించుకోవు.. ఏంటమ్మా ఇది అంటాడు నందు. దీంతో అన్నీ టేబుల్ మీద ఉన్నాయి వెళ్లి తిను అంటుంది అనసూయ. కోపంగా ఉందా? వడ్డించవచ్చు కదా అంటాడు నందు. కోపంగా ఉందా సారీ అంటూ తన కాళ్లు పట్టుకోబోతాడు నందు.

వెళ్లి టేబుల్ మీద కూర్చొని తినబోతూ మీరు తినరా అని అడుగుతాడు. మాకు తినడానికి ముద్ద దిగడం లేదు అంటాడు నందు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ. చెప్పు అమ్మ ప్లీజ్ అంటాడు. ఏమైంది తులసి. అమ్మ ఎందుకు ఏడుస్తుంది అంటే ఏం మాట్లాడదు. దీంతో ఎవరూ చెప్పకపోతే వెళ్లి నాన్ననే ఆడుగుతాను అని అంటాడు నందు. దీంతో ఆగండి.. వెళ్లి ఏం అడుగుతారు. అమ్మ, తులసి ఏడుస్తున్నారు. కారణం అడిగితే చెప్పడం లేదు అని అడుగుతారా? మేము బాధపడుతోందే ఆయన కోసం. ఏడుస్తోందే ఆయన కోసం అంటుంది తులసి. ఏమైంది నాన్నకు అంటే.. ఏమైతే మీకెందుకు అంటుంది తులసి. మీ నాన్న గురించి చెబుదామనే అత్తయ్య ఫోన్ చేసింది చాలా సార్లు. కానీ.. కాల్ లిఫ్ట్ చేయలేదు అంటుంది.

కొడుకులా మీరు పేరెంట్స్ బాధ్యత తీసుకోకపోయినా అమ్మగా నీతో తన కష్టాన్ని పంచుకోవాలని అనుకుంది అత్తయ్య. కానీ.. ఏం లాభం మీ చేతుల్లో ఫోన్ ఉండేది ఎదుటివాళ్లకు నష్టం చేయడానికి అంతే అంటుంది తులసి. మిమ్మల్ని మాట అనే హక్కు నాకు లేదు. అనకూడదు కూడా. కానీ ఏం చేయను. అత్తయ్య బాధ చూడలేక అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక