Intinti Gruhalakshmi 16 Nov Today Episode : శ్రీనివాస్ ను ఒప్పించి షేర్లు అమ్మకుండా చేసిన తులసి.. ఆపరేషన్ చేయకపోవడంతో చనిపోయిన తులసి తల్లి.. ఈ విషయం తులసికి తెలుస్తుందా?
ప్రధానాంశాలు:
శ్రీనివాస్ ను కలవడం కోసం వైజాగ్ వెళ్లిన తులసి, నందు
దీపక్ కాల్ చేసినా అసలు విషయం తెలుసుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నందు
దివ్య, విక్రమ్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్
Intinti Gruhalakshmi 16 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 16 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1103 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరస్వతిని దీపక్ వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తాడు. వెంటనే తనను లోపలికి తీసుకెళ్లి టెస్ట్ చేస్తుంటారు. వెంటనే వదినకు ఫోన్ చేసి చెప్పండి అంటుంది దీపక్ భార్య. ఒక 5 నిమిషాలు ఆగు.. డాక్టర్లు ఏం చెబుతారో చూసి అప్పుడు చేద్దాం అంటాడు దీపక్. మరోవైపు తులసి, నందు ఇద్దరూ విమానంలో వైజాగ్ వెళ్తారు. అక్కడి నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వెళ్తారు. తులసి.. ఇదేనా శ్రీనివాస్ ఇల్లు అంటే అవును అంటుంది తులసి. ఆయనకు ముందే చెప్పావా అంటే లేదు అంటుంది. ఒకవేళ ఆయన రావద్దు అంటే ఏం చేస్తాం అంటుంది తులసి. లోపలికి వస్తారు. ఇంతలో అక్కడ ఆర్కే ఉంటాడు. తులసిని చూసి శ్రీకృష్ణుడి దగ్గరికి ఒకేసారి దుర్యోధనుడు, అర్జునుడు వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే నాకు శ్రీనివాస్ షేర్స్ గురించి మాటిచ్చేశారు అంటాడు ఆర్కే. సామ్రాట్ ఉన్నప్పుడే ఆయన అడ్డం పడ్డారు. ఇప్పుడు నాకు అడ్డేం లేదు అంటాడు ఆర్కే. దీంతో ఇప్పుడు తులసి ఉంది కదా అంటుంది. దీంతో ఇప్పటికే ఫైనలైజ్ అయిపోయింది అంటే మీరు చేసేది ఏం ఉండదు అంటాడు ఆర్కే. షేర్స్ విషయంలో శ్రీనివాస్ గారు ఆల్రడీ డిసైడ్ చేసుకున్నారు. ఇక మీరు వెళ్లిపోవచ్చు అంటాడు ఆర్కే. ఇంతలో శ్రీనివాస్ పీఏ వచ్చి శ్రీనివాస్ గారు బిజీగా ఉన్నారు. మిమ్మల్ని సాయంత్రం కలుస్తా అన్నారు అని చెబుతాడు. దీంతో ఆర్కే వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి.. ఆ పీఏకు చెబుతుంది. సామ్రాట్ కంపెనీ నుంచి సీఈవో తులసి వచ్చారని చెప్పండి. నేను కూడా ఆఫ్టర్ నూన్ కలుస్తా అని చెప్పి బయటికి వస్తారు తులసి, నందు.
ఏదో ఒకటి చేసి మనం కంపెనీని కాపాడుకోవాలి అంటుంది తులసి. పరిస్థితి ఇంత వరకు వచ్చిందని అనుకోలేదు అంటుంది తులసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే.. బీచ్ కి వెళ్దాం అంటాడు నందు. వద్దు.. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్దాం అని అంటుంది తులసి. దీంతో కారులో వెళ్తుంటారు. మేనేజర్ కాల్ చేసినా తులసి లిఫ్ట్ చేయదు. దీంతో మేనేజర్ కాల్ ను నందగోపాల్ ఎత్తి.. మేడమ్ బిజీగా ఉన్నారు. డిస్టర్బ్ చేయకు.. అంటాడు. మరోవైపు సరస్వతికి సీరియస్ హార్ట్ ఎటాక్ వచ్చిందని.. పొజిషన్ క్రిటికల్ గా ఉందని చెబుతారు. అర్జెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెబుతారు డాక్టర్లు. ఎక్కువ వెయిట్ చేయడానికి సమయం లేదు అంటారు. ఆపరేషన్ కు 10 లక్షలు ఖర్చు అవుతుంది. వెంటనే పే చేయండి అంటుంది డాక్టర్. దీంతో దీపక్ కు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే తులసికి ఫోన్ చేయండి అంటుంది దీపక్ భార్య. మరోవైపు రెస్టారెంట్ కు వెళ్తారు తులసి, నందు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నందు తన మనసులో మాట ఇప్పుడైనా చెప్పాలని అనుకుంటాడు. అది.. అది.. అంటూ చెప్పబోతాడు. ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో అదే జరిగింది. అత్తయ్య చెప్పిన మాటలు తలుచుకుంటే ఇప్పుడు భయమేస్తోంది అంటుంది దీపక్ భార్య. వెంటనే వదినకు ఫోన్ చేయండి అంటుంది. ఒక్కసారిగా అంత డబ్బు అంటే తను మాత్రం ఎక్కడి నుంచి తెస్తుంది అని అంటాడు దీపక్. దీంతో తను ఇప్పుడు సామ్రాట్ కంపెనీకి సీఈవో. ఏం కాదు చేయండి అంటుంది దీపక్ భార్య.
Intinti Gruhalakshmi 16 Nov Today Episode : దీపక్ కాల్ చేసినా బిజీ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నందు
దీప్ ఫోన్ చేస్తాడు. కానీ.. తులసి ఫోన్ ను చూడదు. నందు ఫోన్ ను చూసి సైలెంట్ లో పెడతాడు. ఎవరు అని అడుగుతుంది తులసి. ఎవరైనా కానీ.. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అంటాడు నందు. తులసి ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. నందుకు ఫోన్ చేస్తాడు దీపక్. పనీ పాటా లేదా నీకు. ఎందుకు మాటిమాటికి ఫోన్ చేస్తున్నావు. బుద్ధిగా అడిగాను నాకు హెల్ప్ చేయండి అని. తల్లీకొడుకులు నా మీద గొడవ పెట్టారు.. అంటూ దీపక్ చెప్పే విషయం కూడా వినకుండా నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు. దీంతో దీపక్ కు ఏం చేయాలో అర్థం కాదు. వదిన వాళ్ల ఇంటికి వెళ్లండి. అక్కడ అత్తయ్య, మామయ్య ఉంటారు కదా. వాళ్ల ఫోన్ నుంచి చేయొచ్చు అంటుంది.
మరోవైపు రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తారు తులసి, నందు. ఇంటికి వచ్చి అక్క అక్క అంటాడు దీపక్. నందు, తులసి లేరు. ఆఫీసు పని మీద వైజాగ్ వెళ్లారు. అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పు దీపక్ అంటారు పరందామయ్య, అనసూయ. దీంతో తన తల్లి గురించి చెబుతాడు. తులసికి ఫోన్ చేయకపోయావా అంటే.. తులసి, నందు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి.. బావ మాట్లాడాడు కానీ.. నేను చెప్పినా వినిపించుకోలేదు అంటాడు. అయితే.. దివ్యకు ఫోన్ చేస్తా అని అంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత విక్రమ్ కు చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది.
ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ లో దూకడం వల్ల ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. దీంతో దివ్య.. విక్రమ్ ను తిడుతుంది. ఇప్పుడు చూడు ఏమైందో.. రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి అంటుంది దివ్య. కొద్దిసేపు మొబైల్స్ లేకపోతే ఏం కాదులే అంటాడు విక్రమ్.
మరోవైపు మీరు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయండి డాక్టర్ అంటుంది దీపక్ భార్య. దీపక్ ఇంతలో వస్తాడు. అక్క ఊళ్లో లేదు.. వైజాగ్ వెళ్లిందట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటాడు. మరోవైపు తులసి సీఈవో అయిందని తెలిశాక.. శ్రీనివాస్ షేర్లు అమ్మను అని చెబుతాడు. దీంతో తులసి, నందు సంతోషిస్తారు. మరోవైపు ఆపరేషన్ చేయడం లేట్ కావడంతో సరస్వతి ప్రాణం పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.