Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఆఫీసులో నందు పరువు తీసిన రాజు.. సంజు బలవంతం చేయడంతో అబార్షన్ చేయించుకున్న ప్రియ.. ఈ విషయం దివ్యకు తెలుస్తుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఆఫీసులో నందు పరువు తీసిన రాజు.. సంజు బలవంతం చేయడంతో అబార్షన్ చేయించుకున్న ప్రియ.. ఈ విషయం దివ్యకు తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1114 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బసవయ్య, ఆయన భార్య ఇద్దరికీ గంట గంటకు జ్యూస్ ఇవ్వు.. అని ప్రియకు చెబుతుంది దివ్య. దీంతో సరే.. మాకు ఏం కావాలన్నా మేము ప్రియను అడుగుతాం అని అంటారు. దీంతో నేను చెప్పేది మీకు కాదు. తాతయ్యకు అంటుంది దివ్య. ఆ […]

 Authored By gatla | The Telugu News | Updated on :29 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  రాజుకు ఫోన్ చేేసి బారులో జరిగిన విషయం చెప్పిన లాస్య

  •  రాజుతో గొడవ పెట్టుకున్న నందు

  •  అందరి ముందే రాజు కాలర్ పట్టుకున్న నందు

Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1114 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బసవయ్య, ఆయన భార్య ఇద్దరికీ గంట గంటకు జ్యూస్ ఇవ్వు.. అని ప్రియకు చెబుతుంది దివ్య. దీంతో సరే.. మాకు ఏం కావాలన్నా మేము ప్రియను అడుగుతాం అని అంటారు. దీంతో నేను చెప్పేది మీకు కాదు. తాతయ్యకు అంటుంది దివ్య. ఆ తర్వాత దివ్య వెళ్లిపోతుంది. మరోవైపు నందు ఆఫీసుకు రెడీ అవుతాడు. తులసి మాత్రం మళ్లీ హనీని తీసుకొని వెళ్లిపోతుంది. తను వెళ్లిపోయేటప్పుడే నందు గురించి తులసితో మాట్లాడుతారు పరందామయ్య, అనసూయ. కానీ.. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తుంది. అవన్నీ నందు చాటుగా వింటాడు. తను వెళ్లిపోయాక వచ్చి నా తప్పు నేను ఒప్పుకున్నాను కదా అంటాడు. కానీ.. తులసి గురించి నీకు తెలుసు కదా అంటారు వాళ్లు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. తులసితో కలిసి ఆఫీసు పని చేయకు అంటుంది అనసూయ. పని చేయకపోయినంత మాత్రాన తులసి మాట్లాడుతుందా అంటాడు నందు. మరోవైపు రాములమ్మ వచ్చి కాఫీ ఇస్తే తీసుకోరు పరందామయ్య, అనసూయ. దీంతో సరే అమ్మ.. నేను కూడా మానేసి వెళ్లిపోతా అంటుంది రాములమ్మ. ఎందుకే అంటే.. నాకు కూడా పని చేయబుద్ధ కావడం లేదమ్మా అంటుంది. దీంతో నువ్వు కూడా మాతో ఆడుకుంటున్నావా.. ఇటు ఇవ్వు కాఫీ అని చెప్పి కాఫీ తీసుకుంటారు ఇద్దరు.

మరోవైపు రాజుకు ఫోన్ చేసిన లాస్య.. బార్ లో ఏం జరిగిందో చెబుతుంది. మనోడికి చితకొట్టారు. ఆ తర్వాత రోడ్డు మీదికి వస్తే నేను తీసుకెళ్లి ఇంట్లో దింపి వచ్చాను అని చెబుతుంది లాస్య. దీంతో ఓకే.. నేను మళ్లీ ఆఫీసలో అందరికీ ఈ విషయం చెప్పేస్తా అంటాడు రాజు. మరోవైపు ప్రియ.. ఫోన్ లో చిన్నపిల్లల ఫోటోలను చూస్తూ ఉంటుంది. కోపంతో సంజు ఫోన్ ను విసిరికొడతాడు. నీ కడుపులో ఉన్న బిడ్డ చేతుల్లోకి రాకూడదు. టాబ్లెట్స్ వేసుకో అంటాడు చందు. బుద్ధిగా నేను చెప్పింది చేయి అంటాడు. మీరు మనిషా రాక్షసుడా అంటుంది. ఏ ఆడది అయినా అమ్మ అని పిలిపించుకోవాలని తపిస్తుంది. మాతృత్వం కోసం కలవరిస్తుంది. కొట్టండి.. చంపండి నేను మాత్రం ఈ ట్యాబ్లెట్స్ వేసుకోను అంటుంది. దీంతో వేసుకో.. ననేను నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అంటాడు. నా మాట వినకపోతే నా అంత రాక్షసుడు ఉండడు అంటాడు. దీంతో దయచేసి నన్ను ఈ విషయంలో వదిలేయండి అంటుంది ప్రియ. అసలు నేను నీతో ఎన్నాళ్లు కాపురం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అయినా కూడా వినకుండా ఆ ట్యాబ్లెట్స్ అతడి చేతుల్లో పెట్టి బయటికి వస్తుంది.

Intinti Gruhalakshmi 29 Nov Today Episode : దివ్యకు వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

తనను చూసిన దివ్య.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నేను ఏడవట్లేదు అక్క అంటే ఏం జరిగింది. సంజు ఏమైనా అన్నాడా అంటే కోపంతో ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది. ఇంతలో సంజు వస్తాడు. దీంతో దేని కోసమో ఈ రాక్షసుడు ప్రియను ఏడిపిస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది దివ్య. ఇంతలో రాజ్యలక్ష్మి వస్తుంది. నువ్వు నా వాళ్లను కార్నర్ చేస్తే నేను నీవాళ్లను కార్నర్ చేస్తాను. నువ్వు నా ప్రశాంతతను చెడగొడితే.. నేను నిను ప్రశాంతంగా ఉండనీయను. నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు అంటుంది దివ్య.

నన్ను రెచ్చగొడితే నిన్ను కూడా కార్నర్ చేస్తా అంటుంది దివ్య. ఆ విక్రమ్ గాడు నీ చెప్పు చేతుల్లో ఉన్నాడని సంతోష పడకు. వాడిని నా చెప్పు చేతుల్లోకి ఎప్పుడు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. చాలెంజ్ చేయడం నీ వల్ల కాదు అంటుంది రాజ్యలక్ష్మి. చెప్పావు కదా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు అంటుంది దివ్య.

మరోవైపు ఆఫీసులో తులసికి నందు పీఏ ఫోన్ చేసి సార్ మీతో మాట్లాడాలట అంటే.. సరే రమ్మను అంటుంది. ఫైల్ లో ఇష్యూ ఏంటంటే.. అంటే అని చెబుతాడు. అవసరం లేదు అంటుంది తులసి. మనిషి మీద ఎంత కోపం ఉంటే ఆ మనిషి మనసు ఎప్పటికీ అర్థం కాదు. ఫైల్ లోని విషయం అర్థం కాదు అంటాడు. దీంతో అదేమీ అర్థం కానంత విషయం కాదు అంటుంది.

ఫైల్ లో ఒకటి రాయాలని ఇంకొకటి రాస్తే గుర్తుపట్టలేనంత దాన్ని కాదు అంటుంది. దీంతో తులసి అంటాడు నందు. కాల్ మీ తులసి మేడమ్. నేను ఇక్కడ సీఈఓను అంటుంది. నేను ఆఫీసులోని వ్యక్తిగా మాట్లాడటం లేదు. నీ మాజీ భర్తగా మాట్లాడుతున్నా అంటాడు. నా వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి అంటాడు. దీంతో మీ వల్ల జరిగిన ఒక్క మంచి పని ఏంటి చెప్పండి అంటే.. అది కాదు తులసి అంటూ తనను టచ్ చేయబోతాడు. దీంతో నా ముందు కూర్చోవడమే ఎక్కువ అంటే.. నన్ను టచ్ చేస్తారా.. వెళ్లండి. ఇది బార్ కాదు.. దెబ్బలు తినడానికి.. పరువు పోగొట్టుకోవడానికి.. వెళ్తారా లేదా అనేసరికి నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

బయటికి వస్తుండగా స్టాఫ్ దగ్గర రాజు ఉంటాడు. ఏంటి సార్.. సార్ ఏంటి అంత డల్ గా ఉన్నాడు అంటే రాత్రి సార్ ఫుల్లుగా మందు తాగి ఎవరితోనో గొడవ పడ్డారట. తులసి మేడమ్ పిలిచి బాగా క్లాస్ పీకినట్టున్నారు అని స్టాఫ్ తో అంటాడు రాజు. దీంతో అది విన్న నందు… ఏంట్రా వాగుతున్నావు అని కాలర్ పట్టుకుంటాడు.

మీరు తప్పు మీద తప్పు చేస్తూ పోతుంటే ఎలా సమర్థిస్తాం. నాకైనా సిగ్గు ఉండాలి కదా అంటాడు. నా మీద చేయి పడిందంటే సీఈవో గారికి కంప్లయింట్ ఇస్తాడు. ఈరోజు ఆఫీసు నుంచి కూడా గెంటేస్తారు అంటాడు రాజు. దీంతో కోపంతో ఆఫీసు నుంచి బయటికి వస్తాడు. అక్కడ లాస్య కనిపిస్తుంది.

నీకు కాలం కలిసి రావడం లేదు. నిన్న బాధపెట్టిన మనిషిని నువ్వు ఏం చేశావు అని అడుగుతుంది లాస్య. దీంతో నీకు ఇక్కడ పనేంటి అని అంటాడు నందు. కష్టంలో ఉన్న నా మాజీ భర్తకు సాయం చేయాలని ఆగాను అంటుంది. దీంతో నేను అడిగానా అంటాడు నందు. నిన్ను దూరం పెట్టిన వాళ్లకు దగ్గరవ్వాలని చూస్తావు  కానీ.. దగ్గరవ్వాలని అనుకున్న వాళ్లను ఎందుకు దూరం పెడుతున్నావు అని అంటుంది లాస్య.

మరోవైపు ప్రియ అబార్షన్ చేయించుకున్న విషయం తెలిసి దివ్య షాక్ అవుతుంది. వెళ్లి సంజు చెంప వాయిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక