Intinti Gruhalakshmi 8 Nov Today Episode : తులసికి గుడ్ న్యూస్.. హనీపై కేసు వాపసు తీసుకున్న రత్నప్రభ.. లాస్యకు షాక్.. విక్రమ్, దివ్యను డిస్టర్బ్ చేసిన జాను | The Telugu News

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : తులసికి గుడ్ న్యూస్.. హనీపై కేసు వాపసు తీసుకున్న రత్నప్రభ.. లాస్యకు షాక్.. విక్రమ్, దివ్యను డిస్టర్బ్ చేసిన జాను

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1096 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను, బసవయ్య ఇద్దరూ తమ గెటప్ మారుస్తారు. జాను బుర్గా వేసుకుంటుంది. బసవయ్య ముస్లింలా మారిపోతాడు. విక్రమ్, దివ్య ఇక మనల్ని అస్సలు గుర్తు పట్టరు అంటాడు. ఒకసారి వాళ్లు గుర్తు పడతారో లేదో టెస్ట్ చేద్దాం అని […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  మన ఇంటికి వెళ్లిపోదాం అని తులసితో అన్న హనీ

  •  మారు వేషంలో వచ్చి దివ్య, విక్రమ్ హనీమూన్ ను డిస్టర్బ్ చేసిన జాను, బసవయ్య

  •  ఆఫీసుకు రెడీ అయిన తులసి, నందును చూసి లాస్యకు కోపం

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1096 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను, బసవయ్య ఇద్దరూ తమ గెటప్ మారుస్తారు. జాను బుర్గా వేసుకుంటుంది. బసవయ్య ముస్లింలా మారిపోతాడు. విక్రమ్, దివ్య ఇక మనల్ని అస్సలు గుర్తు పట్టరు అంటాడు. ఒకసారి వాళ్లు గుర్తు పడతారో లేదో టెస్ట్ చేద్దాం అని వాళ్ల రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు బసవయ్య. ఎవరో చూద్దాం పదా అని ఇద్దరూ డోర్ తీస్తారు. ఎవరు మీరు ఎవరు కావాలి అని అడుగుతాడు విక్రమ్. మేము అది ఇది అంటూ ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడు బసవయ్య. దీంతో అసలు ఎవరు మీరు.. మీకు ఏం కావాలి అని అడుగుతారు విక్రమ్, దివ్య. దీంతో తన కూతురు పెళ్లి అయింది కానీ.. తన మొగుడు వేరే వాళ్లతో ఉంటున్నాడు అన్నట్టుగా మాట్లాడుతాడు.

మరోవైపు రత్నప్రభను పిలిచి మాట్లాడుతుంది లాస్య. హనీ గురించి కోర్టులో వేసిన కేసును ఎందుకు వాపస్ తీసుకున్నారు అంటే అవసరం లేదనిపించింది అంటుంది రత్నప్రభ. ఏంటి మమ్మి ఈ తింగరి ఆంటి అన్నీ తనకు చెప్పి చేయాలని అంటోంది అంటుంది. దీంతో రత్నప్రభ కూతురుపై సీరియస్ అవుతుంది. మాకు నీ మీద నమ్మకం పోయింది. తులసి ఉండగా హనీ విషయంలో ఏం చేయలేమని అర్థం అయింది. అందుకే యూఎస్ తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాం. ఇక నువ్వు ఏం చెప్పినా వినదలుచుకోలేదు అంటుంది రత్నప్రభ. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. పిరికిపందల్లా పారిపోతున్నారా? వీళ్లను అడ్డం పెట్టుకొని ఆ తులసిని ఆడుకోవాలని చూశాను. కానీ.. ప్లాన్ అంతా రివర్స్ అయింది అని బాధపడుతుంది. మరోవైపు రత్న వాళ్లు హనీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకున్నారని నందు.. తులసికి చెబుతాడు. దీంతో తులసి సంతోషంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది.

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : మా ఇంటికి వెళ్లి అక్కడే ఉందాం అని తులసితో అన్న హనీ

అంటే ఇక వాళ్లు హనీ గురించి అడగరు కదా. హనీని మనకు వదిలేసినట్టే కదా అని అంటుంది అనసూయ. హమ్మయ్య.. ఒక పీడ విరగడ అయింది అని అంటాడు పరందామయ్య. గుడ్ న్యూస్ చెప్పినందుకు అంకుల్ తీసుకోండి అంటూ చాకోలేట్ ఇస్తుంది హనీ. దీంతో నాకు కాదు.. తులసికి ఇవ్వు అంటాడు నందు. ఆంటీ ఒక మాట అడగనా అంటుంది హనీ. కొత్త ఆంటీ వాళ్లు వెళ్లిపోయారు కదా. ఆ ఇల్లు ఖాళీ అవుతుంది కదా. మరేమో.. మనందం వెళ్లి ఆ ఇంట్లో ఉందాం అంటుంది హనీ.

నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతుంది తులసి. దీంతో అస్సలు లేదు. హ్యాపీగా ఉంది అంటుంది. మరి అక్కడికి ఎందుకు అంటే.. అక్కడ ఎవరూ లేరు కదా అంటుంది. నా జీవితం నా చేతుల్లో నుంచి జారిపోయింది. తప్పించుకోలేని ఒక చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాను. అలాగని తప్పించుకోవాలని లేదు. సామ్రాట్ పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద రాసినప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. ఆ కాగితం మీద నీ తలరాత రాసి ఉందని నేను ఊహించలేదు అంటుంది తులసి.

సామ్రాట్ గారు పోయారని తెలియగానే బాధతో పాటు నాకు భయం కూడా వేసింది అంటుంది. నా జీవితాన్ని సరైన దారిలో నడిపించుకోలేని నేను నీ బాధ్యత తీసుకొని ఫెయిల్ అవుతానేమో అని భయం. దేవుడికి మనం తలవంచక తప్పదు అంటుంది తులసి. దీంతో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తులసి అంటాడు పరందామయ్య.

ఆ ఇంటికి వెళ్లి నాకు ఆ ఇంటి మనిషిగా మారాలని లేదు. ఈ ఇంట్లో ఉంటేనే నా మూలాలు నాకు గుర్తుంటాయి. నేనేంటో, నా బాధ్యత ఏంటో నాకు గుర్తుంటుంది. నా పాత్ర ఏంటో.. నా అడుగులు ఎంతవరకో గుర్తుంటాయి అంటుంది తులసి. దీంతో మీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటికి వెళ్లొద్దు. ఇక్కడే ఉందాం అంటుంది హనీ. నేను చెప్పింది నీకు అర్థం కాకపోయినా, నా మనసు తెలుసుకున్నావు. నాకు కావాల్సింది ఇదే అంటుంది తులసి.

మరోవైపు జాను, బసవయ్యకు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ల హనీమూన్ ను ఎలా ఆపాలి. వాళ్ల మధ్య గొడవ ఎలా పెట్టాలి, ఎలా విడదీయాలి అనే దానిపై ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో దివ్య అరుస్తుంది. దీంతో డాడీ దివ్య అక్క అరుపులా అనిపిస్తోంది. ఏం జరుగుతోంది చూద్దాం పదా అంటూ బయటికి వస్తారు.

రూమ్ లోకి వెళ్లి ఏమైంది బేటీ అని అడుగుతాడు. అయితే మాత్రం మీరు మా రూమ్ లోకి వచ్చి మరీ అడుగుతారా? అని అంటాడు విక్రమ్. ప్లాస్టిక్ బల్లిని మంచం మీద వేసి మా ఆవిడను భయపెట్టాను. అందుకే భయపడింది.. చాలా ముందు బయటికి వెళ్లండి అంటాడు విక్రమ్. వీళ్లు మనకు ఎక్కడ దొరికారు. ప్రతి దానికి అడ్డుపడుతున్నారు అని చిరాకు పడతాడు విక్రమ్.

మరోవైపు తులసి తల్లికి గుండె దడగా ఉండటంతో దీపక్ వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. రాగానే నా దగ్గరికే వచ్చావా? ముందు నీ పెళ్లాన్ని అడుగుపో అని అడుగుతుంది. ట్యాబ్లెట్లు కూడా వేసుకోలేదు అని అడుగుతాడు. ఇంతలో తులసి.. ఫోన్ చేస్తుంది. దీంతో అమ్మతో మాట్లాడటానికి ఇప్పటికి టైమ్ దొరికిందా అని అడుగుతుంది. ఇక్కడ ఒక ముసలి ప్రాణం ఉందని నువ్వు పట్టించుకోవు.. అంటుంది. నీ గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు అంటుంది తులసి.

అమ్మకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ తీసుకొని చెబుతాడు దీపక్. నా మాట వినడం లేదు అంటాడు. ప్లీజ్ అమ్మ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకో అని బతిమిలాడుతుంది తులసి. మరోవైపు ఆఫీసుకు వెళ్లేందుకు తులసి, నందు ఇద్దరూ రెడీ అవుతారు. వాళ్లను చూసి పరందామయ్య, అనసూయ సంతోషిస్తారు. వాళ్లిద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్లడానికి చూసి లాస్య తట్టుకోలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...