Intinti Gruhalakshmi 9 Nov Today Episode : తులసి, నందును విడదీసేందుకు రాజుతో కలిసి లాస్య ప్లాన్.. దివ్య, విక్రమ్ హనీమూన్ చెడగొట్టిన జాను.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News

Intinti Gruhalakshmi 9 Nov Today Episode : తులసి, నందును విడదీసేందుకు రాజుతో కలిసి లాస్య ప్లాన్.. దివ్య, విక్రమ్ హనీమూన్ చెడగొట్టిన జాను.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 9 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 9 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1097 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు ఆఫీసుకు వెళ్లడం కోసం కొత్తగా రెడీ అవుతాడు. నందు కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవ్వడం చూసి అనసూయ, పరందామయ్య షాక్ అవుతారు. ఏంట్రో గెటప్ మార్చావు అంటే.. అనసూయ మధ్యలోకి వచ్చి ఇదివరకు అంటే కేఫెలో ఆర్డర్స్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :9 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  తొలి రోజు సంతోషంగా ఆఫీసులో అడుగుపెట్టిన తులసి, నందు

  •  సామ్రాట్ కుర్చీలో కూర్చోకుండా వేరే కుర్చీలో కూర్చున్న తులసి

  •  దివ్య, విక్రమ్ హనీమూన్ ను చెడగొట్టేందుకు జాను విశ్వప్రయత్నాలు

Intinti Gruhalakshmi 9 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 9 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1097 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు ఆఫీసుకు వెళ్లడం కోసం కొత్తగా రెడీ అవుతాడు. నందు కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవ్వడం చూసి అనసూయ, పరందామయ్య షాక్ అవుతారు. ఏంట్రో గెటప్ మార్చావు అంటే.. అనసూయ మధ్యలోకి వచ్చి ఇదివరకు అంటే కేఫెలో ఆర్డర్స్ తీసుకునేవాడు. కానీ.. ఇప్పుడు ఆర్డర్లు వేసే స్థాయికి వెళ్లాడు కదా ఆమాత్రం ఉండాలి అంటుంది అనసూయ. ఆ తర్వాత తులసి కూడా అయి వస్తుంది. నువ్వు బాగా మారిపోయావమ్మా అంటాడు పరందామయ్య. మారితే మారింది కానీ.. ఈ చీరలో మహాలక్ష్మిలా ఉన్నావు అంటుంది అనసూయ. నిజానికి నిన్ను ఇలా రెడీ అవ్వాలని నేనే చెబుదామని అనుకున్నాను కానీ.. నువ్వు ఏమనుకుంటావో అని నేనే చెప్పలేదు అంటాడు నందు. సూట్స్ వేసుకునే సామ్రాట్ నే నేను సింపుల్ గా ఉండేలా మార్చాను. కానీ.. నేనే ఇప్పుడు ఇలా రెడీ అయ్యాను అంటుంది. ఇక బయలుదేరుదామా అంటుంది తులసి. దీంతో హనీ.. తులసికి ముద్దు ఇస్తుంది. మరి మీ ఆంటీని చాకొలెట్స్ తెమ్మని అడగవా అంటే.. నాకు ఏం కావాలో.. ఏం తీసుకురావాలో ఆంటికి తెలుసు. అచ్చం మా డాడీ లాగానే అంటుంది హనీ.

ఆ తర్వాత ఇద్దరూ కారు దగ్గరికి వెళ్తారు. ఒక్క మాటలో చెప్పనా. ఈ గెటప్ లో చాలా బాగున్నావు. నాకు బాస్ లో ఉన్నావు అంటే.. బాస్ లా ఏంటి.. బాస్ ని కానా అంటుంది తులసి. బాస్ వే అంటాడు నందు. ఇదంతా తన ఫోన్ లో సీసీ కెమెరాలో చూస్తుంది లాస్య. తనకు చాలా కోపం వస్తుంది. మాజీ మొగుడును తీసుకొని ఊరేగుతోందా? నందుతోనే తప్పులు చేయించి నీకు వ్యతిరేకంగా మారుస్తాను. చూస్తూ ఉండు అని అనుకుంటుంది లాస్య. ఇద్దరూ రిసార్ట్ లో హోటల్ లో భోం చేస్తుంటారు. దివ్య, విక్రమ్ ఇద్దరూ ఒకరికి మరొకరు తినిపించుకుంటూ ఉంటారు. నువ్వు నాలో సగ భాగం అయ్యావు అని విక్రమ్ అంటే నాకు సరిపోవడం లేదు. నీలో సగ భాగం సరిపోదు. పూర్తి భాగం అవ్వాలి అంటుంది దివ్య. నాకు ఒక్కటి అనిపిస్తోంది.. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఉన్న ప్రేమకు, బయటికి వచ్చినప్పుడు వాళ్ల మధ్య ఉన్న ప్రేమకు చాలా తేడా ఉంది అంటాడు విక్రమ్. ఇంతలో వాళ్లకు ముస్లింల వేషంలో ఉన్న బసవయ్య, జాను ఇద్దరూ క్యాంటీన్ వైపు వస్తుంటారు. వాళ్లను చూసి వామ్మో అని ముఖానికి అడ్డం పెట్టుకున్నా వాళ్ల దగ్గరికే వచ్చి కూర్చొంటారు. దీంతో విక్రమ్ కు చాలా కోపం వస్తుంది.

Intinti Gruhalakshmi 9 Nov Today Episode : దివ్య మీద సాంబారు పోయబోతే బసవయ్య మీద పడ్డ సాంబారు

మరోవైపు ఇడ్లీ, సాంబారు ఆర్డర్ చేస్తుంది జాను. కానీ.. ఎలా తింటావు. బుర్కా తీయాలి కదా అంటాడు బసవయ్య. నేను ఆర్డర్ చేసింది తినడానికి కాదు.. వేడి వేడి సాంబారు దివ్య మీద పోయడానికి అంటుంది. దీంతో ఓకే అంటాడు. ఇడ్లీ, సాంబారు వచ్చాక సాంబారు నాకు ఇంత వద్దు.. కొంచెం తీసుకోండి అని దివ్యకు ఇవ్వబోతుంది. దీంతో నాకు వద్దు అంటుంది దివ్య. ఇంతలో ఆ సాంబారు కాస్త బసవయ్య మీద పడుతుంది. దీంతో దివ్య, విక్రమ్ తెగ నవ్వుతారు.

మరోవైపు నందు, తులసి ఇద్దరూ కలిసి ఆఫీసుకు చేరుకుంటారు. తులసి ముందు వెళ్తుండగా నందు వెనకే ఆగుతాడు. దీంతో ఏంటి వెనకే ఆగిపోయారు అంటే ఇది కంపెనీ కదా. మీరు సీఈవో.. అందుకే మీ వెనుక ఉన్నా అంటే.. మరి ఇంట్లో అవసరం లేదా అంటే.. అలా ఏం కాదు అంటాడు నందు. మీరు వస్తారా లేక నేనే మీ దగ్గరికి వస్తా అంటుంది తులసి. దీంతో నాకు కూడా కావాల్సింది అదే తులసి అనుకుంటుంది.

ఇద్దరూ లోపలికి వెళ్తారు. తులసిని ఉద్యోగులు స్వాగతిస్తారు. కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లి సామ్రాట్ గారికి మంచి నివాళి ఇవ్వాలి అంటుంది తులసి. ఆ తర్వాత తులసి తన రూమ్ కు వెళ్తుంది. సామ్రాట్ కూర్చొనే కుర్చీని చూసి తులసికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సామ్రాట్ ఫోటోను చూసి బాధపడుతుంది. నువ్వు ఇలాంటివి ఎన్నో తట్టుకోవాల్సి ఉంటుంది తులసి. కూర్చో తులసి అంటాడు నందు.

నీకు సామ్రాట్ గారు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు అంటాడు తులసి. నేను హక్కుతో ఇక్కడ కూర్చోవడం లేదు. సామ్రాట్ గారి ఆశయాన్ని గెలిపించాలి. అందుకే నేను ఆయన చైర్ లో కూర్చోలేను. వేరే చైర్ వేసుకొని కూర్చొంటా అంటుంది తులసి.

మరోవైపు రాజుకు ఫోన్ చేస్తుంది లాస్య. దీంతో వెంటనే లేచి నిలబడతాడు రాజు. మేడమ్ చెప్పండి అంటాడు. సర్లే కూర్చో. నువ్వు నిలబడ్డావు అని నాకు తెలుసు. నీకు నా మీద చాలా గౌరవం ఉందని తెలుసు. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నంద గోపాల్ గారు కూడా ఆఫీసుకు వచ్చారు కదా అని అడుగుతుంది. దీంతో అవును మేడమ్ అంటాడు.

మరోవైపు అప్పుడు సామ్రాట్ గారు నాకు సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేయాలని నందును అడుగుతుంది తులసి. నువ్వు నాకు ఒక సాయం చేయాలి. నందును తెగ పొగడ్తల్లో ముంచి నందు, తులసి మధ్య చిచ్చు పెట్టాలి అని రాజుకు చెబుతుంది తులసి. దీంతో ఆ పని నాకు వదిలేయండి మేడమ్. నేను చూసుకుంటా అంటాడు నందు.

ఇక.. సాంబారు మీద పడటంతో కాలుకు గాయం అవుతుంది. దీంతో తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడతారు విక్రమ్, దివ్య. బాషా అంకుల్ కు ఎలా ఉంది అని అడుగుతాడు. లోపలికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమంటారా అంటే వద్దులే బేటీ అంటాడు బసవయ్య. ఏమైనా అవసరం అయితే చెప్పండి అంకుల్. మొహమాటం పడకండి అంటుంది దివ్య.

ఇంతలో దివ్యను కావాలని కాలు అడ్డం పెట్టి పడేస్తుంది దివ్య. దీంతో తన కాలు బెణుకుతుంది. దీంతో హనీమూన్ కు వస్తే మీకు ఇలా జరిగింది. కాలు పట్టుకున్నట్టుంది. మీరు తిరిగి ఇంటికి వెళ్తే బెటర్ అని అంటుంది జాను. కానీ.. దివ్యను ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తారు తులసి, నందు. ఇద్దరినీ చూసి పరందామయ్య, అనసూయ ఇద్దరూ ముచ్చటపడతారు. ఇద్దరూ దగ్గరయితే బాగుండు అని అనుకుంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...