Sudigali Sudheer : మూడు రోజులుగా హాస్పిటల్‌లోనే సుడిగాలి సుధీర్ ! ఆందోళనలో ఫ్యాన్స్
ప్రధానాంశాలు:
Sudigali Sudheer : మూడు రోజులుగా హాస్పిటల్‌లోనే సుడిగాలి సుధీర్ ! ఆందోళనలో ఫ్యాన్స్
Sudigali Sudheer : బుల్లితెర, వెండితెర నటుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం టీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో చేస్తున్నాడు సుధీర్. ఆ షోలో తప్ప బయట మీడియాకు, సినిమా ఈవెంట్స్ లో కనపడి చాలా రోజులైంది. అయితే తాజాగా చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కు వచ్చాడు సుధీర్. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. సముద్రఖని కీలకపాత్రలో తండ్రీకొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Sudigali Sudheer : మూడు రోజులుగా హాస్పిటల్‌లోనే సుడిగాలి సుధీర్ ! ఆందోళనలో ఫ్యాన్స్
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(ఆదివారం) హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కు సుధీర్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో సుధీర్ మాట్లాడిన తర్వాత ధనరాజ్ మాట్లాడుతూ.. సుధీర్ కి హెల్త్ బాగోలేదు. డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. మూడు రోజుల నుంచి తనకి మాట్లాడటానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే వస్తాను అని చెప్పాడు. ఆరోగ్యం బాగోకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్లలో సుధీర్ ముందుంటాడు. చాలా మొహమాటం సుధీర్ కి. అతని ఫంక్షన్స్ కి వెళ్ళడానికే ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడు అని అన్నారు.
దీంతో ధనరాజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాట్లాడటం కూడా కష్టం అయ్యేలా సుధీర్ కి ఏమైంది? మూడు రోజులుగా సుధీర్ హాస్పిటల్ లో ఎందుకున్నాడు? సుధీర్ కి ఏమైంది? సుధీర్ హెల్త్ సమస్య ఏంటి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సుధీర్ కానీ, ధనరాజ్ కానీ క్లారిటీ ఇస్తారా చూడాలి. ఫ్యాన్స్ మాత్రం సుధీర్ కి ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు. ఇక సుధీర్ హీరోగా ప్రస్తుతం G.O.A.T(Greatest Of All Times) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ భామ దివ్య భారతి హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది