Sudigali Sudheer : సుధీర్‌కి హ‌గ్గుల మీద హ‌గ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ‌.. మిగ‌తా వాళ్ల‌కి అసూయ వ‌చ్చేసిందిగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sudigali Sudheer : సుధీర్‌కి హ‌గ్గుల మీద హ‌గ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ‌.. మిగ‌తా వాళ్ల‌కి అసూయ వ‌చ్చేసిందిగా..!

Sudigali Sudheer  : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న సుడిగాలి ఇప్పుడు సుధీర్ హీరోగా ఎదగాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడని ప‌లువురు ద‌ర్శ‌కులు ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నారు. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కి అచ్చొచ్చిన బుల్లితెర‌పై మ‌ళ్లీ సంద‌డి చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2024,4:30 pm

Sudigali Sudheer  : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న సుడిగాలి ఇప్పుడు సుధీర్ హీరోగా ఎదగాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడని ప‌లువురు ద‌ర్శ‌కులు ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నారు. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కి అచ్చొచ్చిన బుల్లితెర‌పై మ‌ళ్లీ సంద‌డి చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మ‌రోవైపు ఆహా వేదిక‌గా స‌ర్కార్ అనే షో చేస్తున్నాడు. ఈ షో కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.

Sudigali Sudheer హ‌గ్గుల మీద హ‌గ్గులు

సర్కార్ పదో ఎపిసోడ్ ప్రోమోని రీసెంట్‌గా ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా షేర్ చేసింది. “రంగుల లోకం, అందాలు ప్రత్యక్షం.. సర్కార్ తో చెయ్యొద్దు మీరు పరిహాసం” అనే క్యాప్షన్ తో ఈ కొత్త ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఇందులో న‌లుగురు అమ్మాయిలు సంద‌డి చేశారు. వారిలో స్రవంతి, శుభ శ్రీ, హమీదా, శోభా శెట్టిలు ఉన్నారు. వారిని చూసిన సుధీర్ కు కవిత్వం పొంగుకొచ్చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎంతో మంది చచ్చిపోతారు పాము కుట్టి.. ఇప్పుడొస్తుంది శోభా శెట్టి.. నిన్ను ఇంత అందంగా పుట్టించినందుకు శుభ శ్రీ.. ఆ దేవుడికి ఇవ్వాలి పద్మ శ్రీ.. దేవకన్యలు తిరుగుతారు భూమ్మీద.. దానికి సాక్ష్యమే హమీదా.. ఇలా సుధీర్ త‌న క‌విత్వంతో తెగ ఇంప్రెస్ చేశాడు.

Sudigali Sudheer సుధీర్‌కి హ‌గ్గుల మీద హ‌గ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ‌ మిగ‌తా వాళ్ల‌కి అసూయ వ‌చ్చేసిందిగా

Sudigali Sudheer : సుధీర్‌కి హ‌గ్గుల మీద హ‌గ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ‌.. మిగ‌తా వాళ్ల‌కి అసూయ వ‌చ్చేసిందిగా..!

ఈ ప్రోమో త‌ర్వాత సుధీర్- హమీదా గురించే టాక్ వైరల్ అవుతోంది. షోలో అడుగుపెట్టినప్పటి నుంచి షో ముగిసే వరకు హమీదా- సుధీర్ హగ్గులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సుధీర్ ఏ చిన్న మాట చెప్పినా కాంప్లిమెంటరీగా హగ్గులు ఇచ్చేసింది హ‌మీదా. ఇప్పటి వరకు ఈ షోలో ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ మాత్రం లేవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే వీళ్లిద్దరి బాండింగ్ భలే ఉంది అని అంటున్నారు.. ఈ షోలో ఇంకో ముగ్గురు బ్యూటీలు షోకి గ్లామర్ పెంచేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మంచి మజా అందించ‌డం ఖాయం అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది