Viral Video : కొడుకు శవంతో బైక్ పై 90 కిలోమీటర్లు.. దీనస్థితిలో ఓ తండ్రి ఆవేదన
Viral Video : కొన్ని సంఘటనలు చూస్తే పేదవాడిగా పుట్టడమే తప్పేమో అనిపిస్తుంది. ఓ కన్న తండ్రి అత్యంత దీనావస్థలో తన కొడుకు శవాన్ని ఊరికి తీసుకువెళ్లేందుకు ఎంతో సాహసం చేశాడు. 90 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి కొడుకు శవాన్ని ఊరికి చేర్చాడు. ఇంతటి దౌర్బాగ్య స్థతి ఏ తండ్రికి రాకూడదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాలు ఇంత చేశాం అంత చేశాం.. అని డబ్బా కొట్టుకుంటాయి తప్పితే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
మొన్న వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి కాళ్లను ఎలుకలు కొరికాయి. ఆ మధ్య బైక్ పై తల్లి శవంతో ఓ కొడుకు దీనస్థితిలో వెళ్లాడు. ఇలా ఎన్నో సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నాయి.తిరుపతి ఏరియా ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అనారోగ్యంలో బాలుడు చనిపోగా బాడీ ని తీసుకెళ్లడానికి అంబులెన్సు ఏర్పాటు చేయమని కుటుంబ సభ్యులు కోరారు. అంబులెన్సు మాఫియా సిబ్బంది ఎక్కువ మొత్తంలో పైసలు డిమాండ్ చేయగా డబ్బులు లేకపోవడంతో చేసేది ఏమిలేక బాధపడ్డాడు ఆ తండ్రి.
కొడుకు చనిపోయిన బాధలో ఆ తండ్రి ఉంటే కనీస కనికరం చూపింపచలేదు ఆసుపత్రి సిబ్బంది. అయితే కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి ఎదురు చూశారు. ఇక చేసేదేమిలేక ఆ తండ్రి బండిపై తన 10 సంవత్సరాల కొడుకు శవాన్ని ఏకంగా 90 కిలోమీటర్లు తరలించాడు. ఈ సంఘటన చూపరులను కంటతడిపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈసంఘటన పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.