Viral Video : ఒకే ఆటోలో 27 మంది.. అది కూడా చిన్న ఆటో.. వాళ్లంతా ఆటోలో ఎలా కూర్చున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఒకే ఆటోలో 27 మంది.. అది కూడా చిన్న ఆటో.. వాళ్లంతా ఆటోలో ఎలా కూర్చున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 July 2022,7:40 am

Viral Video : సాధారణంగా ఒక చిన్న ఆటోలో ఎంత మంది కూర్చొంటారు చెప్పండి. మా అంటే ముగ్గురు కూర్చొంటారు అంతే. అంతకుమించి ఓ నలుగురు అంతే కదా. ఓ 10 మంది కూర్చోవడానికి అయితే వీలు పడదు. 7 సీటర్ ఆటోలో అయితే ఓ 10 మంది వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ.. ఈ చిన్న ఆటోలో ఎంతమంది కూర్చున్నారో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఒకే ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆటో ఆపారు. ఆటో ఆపి.. ఒక్కొక్కరిని కిందికి దింపి..

ఎంత మంది ఆటోలో ప్రయాణించారో తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో చోటు చేసుకుంది. ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు.అందులో నుంచి దిగిన ప్రయాణికులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతమంది ఆ ఆటోలో ఎలా పట్టారా అని షాక్ అయ్యారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు అని.. డ్రైవర్, పిల్లలతో సహా.. మొత్తం 27 మంది ప్రయాణికులు అందులో ప్రయాణించారు. ఈద్ సందర్భంగా దర్గాలో నమాజ్ చేసిన అనంతరం వాళ్లు తిరుగు ప్రయాణం అవగా..

auto carries 27 passengers in uttar pradesh video viral

auto carries 27 passengers in uttar pradesh video viral

Viral Video :  సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆటోను పోలీసులు ఆపారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కొక్కరిని దింపి అందులో ఉన్న ప్రయాణికులను లెక్కిస్తే 27 మంది అయ్యారు. దీంతో ఆటోకు ఓవర్ స్పీడింగ్ తో పాటు.. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు ఫైన్ వేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. వామ్మో అంత చిన్న ఆటోలో 27 మందిని ఎలా కూర్చోబెట్టావురా బాబు..అంటూ ఆ ఆటో డ్రైవర్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది