Viral Video : అయోధ్య రామ జన్మభూమి వద్ద లేడీ కానిస్టేబుల్స్ డాన్సులు ప్రభుత్వం ఊహించని షాక్ వీడియో ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : అయోధ్య రామ జన్మభూమి వద్ద లేడీ కానిస్టేబుల్స్ డాన్సులు ప్రభుత్వం ఊహించని షాక్ వీడియో ..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :17 December 2022,12:20 pm

Viral Video : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రామ జన్మభూమి అయోధ్యలో… రామ మందిరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ హంగులతో.. కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. అటువంటి ఈ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్స్ డాన్సులతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇది కాస్త ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో… వీడియోలో డాన్స్ చేసిన ఆమెతోపాటు నలుగురు మహిళా

కానిస్టేబుల్ సస్పెండ్ చేసి ఊహించని షాక్ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నలుగురు లేడీ కానిస్టేబుల్ అయోధ్యలో రామ మందిరం దగ్గర భద్రత కోసం ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే విధులు నిర్వహిస్తూనే మరోపక్క రీల్స్ చేస్తూ బోజ్ పూరి పాటకి డాన్స్ చేయటంతో మరో ఇద్దరు చప్పట్లతో ప్రోత్సహించటంతో..

Ayodhya Lady Constables Dance video viral on twitter

పాటు మరో కానిస్టేబుల్ వీడియో తీయడం జరిగింది. అంతేకాదు మహిళా సిపాయిల డ్యాన్స్ అంటూ క్యాప్షన్ జత చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వీడియోలో డాన్స్ చేస్తున్న అమ్మాయితో పాటు మిగతా వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నప్పటికీ… ఉన్నతాధికారులు ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుని నలుగురిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది