Viral Video : బరాత్ లో డ్యాన్స్ తో దుమ్ములేపుతున్న మహిళలు.. పెళ్లి కూతురుతో కలిసి మాస్ స్టెప్పులు
Viral Video: పెళ్లంటే ఒకప్పుడు సందడి మరోలా ఉంటుండే.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లంటే డ్యాన్స్.. డీజే సాంగ్స్ అనేలా మార్చేశారు. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు చాన్స్ దొరకాలేగానీ డ్యాన్స్ తో దుమ్ములేపుతారు. ఇక పెళ్లీలో అయితే డ్యాన్స్ తో ఇరగదీస్తున్నారు. పెళ్లి కూతుళ్లు ఎలాంటి జంకు లేకుండా అందరి ముందు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మండపానికి వస్తూనే డ్యాన్స్ చేస్తూ వచ్చి కూర్చుంచున్నారు. సిగ్గుపడుతూ తలదించుకునే అమ్మాయిలు అందరిముందు క్యూట్ లుక్స్ తో స్టెప్పులేసి ఆశ్చర్యపరుస్తున్నారు.
తెలంగాణలో ఎక్కువగా పెళ్లిలో డ్యాన్స్ చేస్తుంటారు. అంతే కాకుండా స్పెషల్ గా బరాత్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కలిసి డీజే సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా అందిరితో పాటు మాస్ డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స ఇలా అందరూ బరాత్ లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ డ్యాన్స్ వీడియోలను జ్ఞాపకాలుగా దాచుకుంటారు.
ప్రస్తుతం బరాత్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. డీజే సాంగ్స్ కి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చూట్టూ అందరూ చేరి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే లేడీస్ కూడా ఊరమాస్ స్టెప్పులు వేస్తున్నారు. బంజార సాంగ్స్ కి గ్రూప్ గా చేరి చూట్టూ తిరుగుతూ రచ్చచేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో లక్షల్లో వ్యూస్ రాగా, నెటిజన్లు కామెంట్స్, లైకులు కొడుతున్నారు.