Viral Video : పెళ్లి కూతురు అదిరిపోయే రేంజ్ లో పెళ్లి మంటపానికి ఎంట్రీ.. చూసిన వాళ్లంతా అవాక్కే!
Viral video : ఈ మధ్యన ఏం చేసినా కాస్త డిఫరెంట్ గా చేయాలనే జనాల సంఖ్య బాగా పెరిగింది. అందరిలాగా మనం చేస్తే మనకు గుర్తింపు ఎందుకు వస్తుందని, కాబట్టి కాస్త డిఫరెంట్ గా చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాగే తాజాగా ఓ తెలుగు పెళ్లి కూతురు కూడా అనుకున్నది. అనుకున్నదే తడువుగా పెళ్లి మంటపానికి తాను అనుకున్న విధంగానే ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా పెళ్లి కూతురు అంటే సిగ్గుతో తల దించుకొని ఉంటుంది అందరూ అనుకుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
పెళ్లిలో పెళ్లి కూతుళ్లు మునుపటిలాగా సిగ్గుతో తలదించుకొని కూర్చోవడం లేదు. పెళ్లి హడావిడి మొత్తం వారే చేసేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు అదిరిపోయే రేంజ్ లో పెళ్లి మంటపానికి ఎంట్రీ ఇచ్చింది. ఇది చూసిన బంధువులు, పెళ్లికి వచ్చిన వాళ్లంతా అరె వావ్ అని అనుకున్నారు. ఇంతకీ పెళ్లి కూతురు అంతలా ఏం చేసిందని అనుకుంటున్నారా? పెళ్లి కూతురు అదిరిపోయే తెలుగు పాటలతో డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి మండపంలోకి అడుగు పెట్టింది. అల్లు అర్జున్ చేసిన సూపర్ మచ్చి పాటతో ఎంట్రీ ఇచ్చిన పెళ్లి కూతురు అందరిలో జోష్ నింపింది. అమ్మడి స్టెప్స్ అందరినీ ఆకట్టుకోగా.. ఆ అమ్మాయి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు.

Bride Dance With Telugu songs on video Viral
Viral video : ఓ రేంజ్ లో ఎంట్రీ..
అమ్మాయి తర్వాత విజయ్ చేసిన మాస్టర్ సినిమాలోని వాతీ కమింగ్ సినిమా పాటకు కూడా అదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ చేసింది. తర్వాత సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ హిట్ అయిన రాములో రాముల పాటకు అదరగొట్టింది. అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్ ని పెళ్లి కూతురు కూడా వేసి అందరినీ అలరించింది. బంధువుల్లో చాలామంది అమ్మడు డ్యాన్స్ చేస్తుంటూ వాళ్లు కూడా కాళ్లు కదిపారు. తమకు వచ్చిన స్టెప్పులతో అమ్మాయిలో జోష్ నింపారు. మొత్తానికి పెళ్లి కూతురు ఎంట్రీ అంటే ఇలా ఉండాలనే రేంజ్ లో అమ్మడు అదరగొట్టింది.
