Viral Video : రిసెప్షన్ లో పెళ్లికూతురు డ్యాన్స్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేసింది
Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల సందడి మామూలుగా లేదు… ఏ పెళ్లిలో చూసిన పెళ్లి కూతురు డ్యాన్స్ తప్పనిసరి ఉండాల్సిందే.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సిగ్గుతో భయపడి సైలెంట్ గా ఉండే అమ్మాయిలు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్నట్లు చూస్తున్నారు. అబ్బాయిలు సిగ్గుపడుతూ ఉంటే అమ్మాయిలు ఎక్కడా తగ్గడం లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎలాంటి జంకు లేకుండా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.
అందుకు ఫ్రెండ్స్, బంధువులు కూడా ఎంకరేజ్ చేస్తుండటంతో డ్యాన్స్ చేసి పార్ట్ నర్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలకు ఇష్టమైన సాంగ్.. ప్రతి పెళ్లిలో వినిపించే ట్రెండింగ్ సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి.. ఈ సాంగ్ పై అమ్మాయిలు ఎంతో ఇష్టంతో తమ పార్ట్ నర్ పై ఫీలింగ్స్ ని బయటపెడుతూ చెప్పకనే చెప్తుంటారు. పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తూ అతని చేయి పట్టుకుని ఆడిపాడతారు. అందుకే అమ్మాయిలు ఈ సాంగ్ ని ఎక్కువ లైక్ చేస్తుంటారు.
అప్పట్లో జగిత్యాలలో ఓ పెళ్లికూతురు ఈ సాంగ్ పై డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఇక అప్పటినుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఓ రిసెప్షన్ లో కూడా బుల్లెట్టు బండెక్కి సాంగ్ ని మోగిస్తున్నారు. పెళ్లి కూతురు కాస్తా సిగ్గుపడుకుండూ డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. బంధువులు ఎంకరేజ్ చేస్తూ స్టేజిపై తెగ హడావుడి చేస్తుస్తున్నారు. పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తుంటే పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ అలా నిల్చుండిపోయాడు.