Viral Video : పెళ్లి బట్టల్లో పరీక్ష రాసిన పెళ్లికూతురు .. వైరల్ అవుతున్న వీడియో ..!!
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ వీడియోలను తీసి షేర్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు, ఫోటోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు ఆలోచింపచేస్తాయి. అయితే ఈ వీడియో మాత్రం కాస్త ఆశ్చర్యానికే గురిచేస్తుంది. దీంతో ఆ వీడియోలు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వీడియో వైరల్ అవుతుంది. పెళ్లి బట్టలు ధరించిన పెళ్ళికూతురు ఎగ్జామ్ హాల్ కి వచ్చి పరీక్ష రాసింది.

Viral Video in Bride write the exams in wedding sareeViral Video in Bride write the exams in wedding saree
కేరళకి చెందిన శ్రీలేకిష్మ అనే యువతి బెథానీ నవజీవన్ ఫిజియోథెరపీ కాలేజీలో ఫిజియోథెరపీ కోర్స్ చేస్తుంది. అయితే ఇటీవల ఆమెకు ఆమె తల్లిదండ్రులు ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. కానీ పెళ్లి రోజే ఆ యువతకి ఫిజియోథెరపీ ప్రాక్టికల్స్ జరిగాయి. అయితే చదువుపై ఉన్న ఇష్టంతో ఆ పెళ్లికూతురు పెళ్లి మండపం నుంచి నేరుగా వచ్చి పరీక్ష రాసింది. శ్రీలేకిష్మ పెళ్లి బట్టల్లో క్లాస్ రూమ్ కి రావడంతో ఆమె స్నేహితులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తెలుసుకుని స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Viral Video in Bride write the exams in wedding saree
అనంతరం ఈ పెళ్లికూతురు పరీక్ష రాసి నేరుగా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయింది. అయితే ఆమె పెళ్లి బట్టలో వచ్చి పరీక్ష రాయడంతో ఆమె స్నేహితులు వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆ యువతికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి ప్రశంసించారు. మరికొందరు శభాష్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఏది ఏమైనా ఆ పెళ్ళికూతురు పెళ్లి దుస్తుల్లో వచ్చి ఎగ్జామ్స్ రాయడం అందరికీ షాకింగ్ గా అనిపించింది.
View this post on Instagram