Viral Video : హృతిక్ రోషన్ సినిమా చూసి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన పిల్లోడు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : హృతిక్ రోషన్ సినిమా చూసి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన పిల్లోడు వీడియో వైరల్..!!

Viral Video : పిల్లలపై సినిమాల ప్రభావం చాలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం ఏది పిల్లలు చూడాలో ఏది పెద్దవాళ్లు చూడాల్సిన సినిమాయే సర్టిఫికెట్ జారీ చేస్తారు. చాలా వరకు పిల్లలు సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో సినిమాలో హీరో చేసిన మాదిరిగా చేయాలని ఇంటి దగ్గర అదేవిధంగా స్కూల్లో రకరకాల స్టట్న్స్ చేస్తుంటారు. తాజాగా ఈ రకంగానే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :22 July 2023,12:00 pm

Viral Video : పిల్లలపై సినిమాల ప్రభావం చాలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం ఏది పిల్లలు చూడాలో ఏది పెద్దవాళ్లు చూడాల్సిన సినిమాయే సర్టిఫికెట్ జారీ చేస్తారు. చాలా వరకు పిల్లలు సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో సినిమాలో హీరో చేసిన మాదిరిగా చేయాలని ఇంటి దగ్గర అదేవిధంగా స్కూల్లో రకరకాల స్టట్న్స్ చేస్తుంటారు.

తాజాగా ఈ రకంగానే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సినిమా చూసి ఏకంగా స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి మొదటి అంతస్తు రైలింగ్ పైకి ఎక్కి.. ఒక్కసారిగా కిందకు దూకాడు. సరిగ్గా భూమికి 15 అడుగుల పైనుంచి మూడో తరగతి విద్యార్థి కింద పడగానే ముక్కు కాళ్లు చేతులు గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్కూల్ సిబ్బంది.

children jumping off the school building

children jumping off the school building

సదరు విద్యార్థిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. హృతిక్ నటించిన క్రిష్ సినిమాలో యాక్షన్ సీన్స్ చూసి అదే మాదిరిగా చేయాలని ఆ విద్యార్థి ప్రయత్నం చేయడం జరిగిందంట. సదరు విద్యార్థి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటనలు మొత్తం పాఠశాలల్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది