Viral Video : తొక్కుడు బిళ్ల ఆట ఆడిన కుక్క.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..
Viral Video : కుక్కేంటి.. తొక్కుడు బిళ్ల ఆడటమేంటి అంటారా? నమ్మరు కదా. కానీ.. ఈ వీడియో చూస్తే మీరే నోరెళ్లబడతారు. ఎందుకంటే.. సాధారణంగా మనమే తొక్కుడు బిళ్ల ఆటను మరిచిపోయాం.అసలు.. ఇప్పుడు ఎవరైనా తొక్కుడు బిళ్ల ఆటను ఆడుతున్నారా? ఒక్కరు కూడా ఆడటం లేదు. వెనుకటికి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంతో సరదాగా తొక్కుడు బిళ్ల ఆటను ఆడుకునేవారు. కానీ..
ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లలోనే. పిల్లలు అంతా కలిసి సరదాగా బయట ఆడుకునే రోజులు ఇప్పుడెక్కడున్నాయి.తొక్కుడు బిళ్ల ఆట ఆడటం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పిల్లల మానసిక ఎదుగుదలకు కూడా అది ఎంతో ఉపయగపడుతుంది. అందుకే.. తొక్కుడు బిళ్ల ఆటను పిల్లలతో ఆడిస్తారు. కానీ.. ఇఫ్పుడు అందరూ ఆ ఆటను మరిచిపోయారు. గ్రామాల్లో కూడా ఎక్కడా తొక్కుడు బిళ్ల ఆటను ఆడటం లేదు.

dog playing thokkudu billa game viral video
Viral Video : కుక్క ఎంత బాగా తొక్కుడు బిళ్ల ఆట ఆడిందో?
కానీ.. ఓ కుక్క మాత్రం మనం మరిచిపోయిన తొక్కుడు బిళ్ల ఆటను ఆడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ కుక్క తొక్కుడు బిళ్ల ఆట ఆడటం చూసి నెటిజన్లే నోరెళ్లబెడుతున్నారు. మేమంతా మరిచిపోయినా… నువ్వు ఎంతో బాగా తొక్కుడుబిళ్ల ఆడావు. గ్రేట్.. హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/guldurbakalim/status/1472662233377394695?s=20