Viral Video : సింగిల్ గా వచ్చి ఆవులను గడగడలాడించిన బాతు.. వీడియో వైరల్
Viral video : నాన్నా పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. రజినీ కాంత్ డైలాగుల్లో ఇది ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని సందర్భాన్ని బట్టి వాడేస్తుంటారు చాలామంది. ఇక జంతువుల విషయంలో కూడా ఈ డైలాగ్‌ను వాడాల్సి వస్తోంది. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే వైరల్ అయిపోతున్నాయి చాలా వీడియోలు.
ఇప్పుడు కూడా ఈ డైలాగ్ కు తగ్గట్టే ఒక్క వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.ఈ వీడియోలో ఓ బాతు కొన్ని ఆవుల దగ్గరకు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వీడియోను బట్టి చూస్తే అది మన దేశంలో కాదని తెలిసిపోతుంది. ఇందులో ఉన్న ఆవులు విదేశాల్లో ఉన్నవే. అయితే ఈ ఆవుల దగ్గరకు ఓ బాతు రావడంతో.. దాన్ని తన్ని తరిమేయాలని ఆ ఆవులు ఒక్కొక్కటి బాతు దగ్గరకు రావడం..

duck that came a single and slaughtered the cows video went viral
Viral video : ఎందుకిలా భయపడుతున్నాయి..?
ఏదో షాక్ కొట్టినట్టు ఆగిపోయి వెనక్కు పరుగెత్తడం మనం చూడొచ్చు. బాతా దగ్గరకు వచ్చినా కొద్దీ అవన్నీ భయపడి పారిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదేదో పవర్‌ను చూసినట్టు అవన్నీ భయపడి పారిపోవడం మనకు కనిపిస్తుంది. దీన్నంతా కొందరు వీడియో తీయగా.. అది కాస్తా వైరల్ అయిపోతోంది. దీనిపై చాలా కామెంట్లు వస్తున్నాయి. అది పవర్ బాతు అని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/Sci_Nature0/status/1490743590598893574