Viral Video : ఇది బాల్య వివాహం అనుకుంటే పొరపాటే..వాళ్ల వయసు ఇరవై పైనే… బిహార్ లో అరదైన వివాహం
Viral Video: ప్రతి ఒక్కరికీ పెళ్లి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. పెళ్లి చేసుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. అయితే చాలా మందికి ఎంత వయసొచ్చినా పెళ్లి కాదు. కారణం అబ్బాయికి అమ్మాయి దొరక్కపోవడం.. అమ్మాయికి అబ్బాయి దొరక్కపోవడం. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో సంబంధాలు చూస్తారు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదంటూ బాధపడతారు. అయితే సాధారణంగా ఇద్దరిలో ఎలాంటిలోపం లేనట్లయితే తొందరగానే పెళ్లి జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరు పుట్టుకతోనే లోపాలతో పుడతారు. వీళ్లకే పెళ్లితో అసలు సమస్య వచ్చిపడుతుంది.అయితే రకరకాల కారణాలు చెప్పి చాలా మంది అమ్మాయిలు గానీ.. అబ్బాయిలు గానీ రిజక్ట్ చేస్తుంటారు.
సన్నగా ఉన్నాడనో లేక నల్లగా ఉన్నాడనో.. లేదా పొట్టిగా ఉన్నాడనో.. అంగవైకల్యం ఉందనో ఇలా చాలా కారణాలతో సంబంధాలు కలుపుకోలేకపోతారు. అయితే పొట్టిగా ఉన్నవారిని పొట్టిగా ఉన్నవాళ్లు చేసుకుకోవడానికి.. ఇలా ఇద్దరి లోపాలు సేమ్ ఉంటే ఇద్దరి అంగీకారంతో పెళ్లి జరిగిపోతుంది. అయితే మరుగుజ్జుగా ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడానికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.గతంలో యూపీలో ఇలాంటి సంఘటనే జరిగింది. 26ఏళ్ల అజీమ్ మన్సూరి చాలా పొట్టిగా ఉంటాడు. 2.5 అడుగుల ఎత్తు ఉంటాడు. 5వ తరగతి వరకు చదువుకున్నాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ పెళ్లి కావడం లేదని తీవ్రంగా బాధపడ్డాడు. మరుగుజ్జు కావడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి కూడా ఇష్టపడ లేదు.
పెళ్లి సంబంధాలు చూడాలని ఏకంగా యూపీ సీఎం, పోలీస్ స్టేషన్ కు లేఖరాశాడు. దీంతో పెళ్లి సంబంధాలు వెల్లువెత్తాయి. ఇలా గతంలో ఏపీలో కూడా ఓ మరుగుజ్జు జంట ఇరుకుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇలా బిహార్ లోని భగల్ పూర్ జిల్లాలోని విందేశ్వరి మండలం మష్రు గ్రామానికి చెందిన మున్నా 26 సంవత్సరాలు ఉంటాడు. అయితే ఇతను కేవలం 36 అంగుళాలు ఉంటాడు. అభియా బజార్‌కు చెందిన కిషోరి మండల్ కుమార్తె 24 సంవత్సరాల మమత కుమారి 34 అంగుళాలు మాత్రమే ఉండటంతో వివాహం చేసుకున్నాడు. కాగా ఈ జంటను చూడటానిక చుట్టుపక్కల జనం తరలి వచ్చారు. ఈ జంటతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇంకెందుకు లేటు మీరుకూడా చూసేయండి మరి….