Viral Video : వామ్మో.. డేంజర్ డేగ.. నీళ్లలో ఉన్న పెద్ద చేపను ఎలా పట్టేసిందో చూడండి
Viral Video : ఒరేయ్ నీకు డేగ కళ్లు ఉన్నాయిరా అని అంటుంటారు కొందరు. డేగ కళ్లు అని ఎందుకు అంటారు అంటే.. డేగ కళ్లు చాలా స్పష్టంగా.. చాలా దూరం కూడా కనిపిస్తాయి. అందుకే డేగకన్ను అని కూడా అంటుంటారు. ఎక్కడో పైన ఉన్న డేగలకు భూమ్మీద ఉండే వన్నీ స్పష్టంగా కనిపిస్తాయట. నీళ్లలో ఉండే జీవులు కూడా గద్దలకు కనిపిస్తాయట.గద్దలకు దేవుడు అలా ప్రత్యేకంగా అంత మంచి కళ్లను ప్రసాదించాడు.
డేగలు ఆకాశంలో విహరిస్తూ.. భూమ్మీద ఉన్న జంతువులను పసిగడతాయి. అవి వేటాడాలి అని అనుకుంటే.. ఆకాశం నుంచే వేటాడుతాయి. ఆకాశంలోనే వాటికి కావాల్సిన ఆహారాన్ని వెతికి.. దాని దగ్గరికి క్షణాల్లో దూసుకెళ్తుంది. ఆ తర్వాత దాన్ని కాళ్లతో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ గద్ద నీళ్ల మీద నుంచి వెళ్తూ.. నీళ్ల మీద తేలియాడుతున్న ఓ చేపను గమనించింది.
Viral Video : పెద్ద చేపను అవలీలగా పట్టేసుకున్న డేగ
అంతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. దాని దగ్గరికి దూసుకెళ్లి చేపను తన కాళ్లతో పట్టుకెళ్లిపోయింది. ఈ ఘటన కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. డేగ కన్ను అని ఊరికనే అనలేదు పెద్దలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
What eye, what landing! WoW ????????pic.twitter.com/qOOkPjyqJK
— Figen (@TheFigen) February 23, 2022