Viral Video : ఏనుగు పిల్లా.. మజాకా.. 14 సింహాలకు చుక్కలు చూపించింది..!
Viral Video : అడవి మొత్తానికి సింహాం రారాజు అంటుంటారు. నిజమే మరి సింహం పంజా విసిరిందంటే ఆ దెబ్బకు ఏ జంతువైనా నేల కూలాల్సిందే. దాని పంజాలో అంత పవర్ ఉంటుంది. ఇక అడవిలో చిన్న జంతువు, పెద్ద జంతువు అనే తేడా లేకుండా దేనినైనా వేటాడి తింటుంది సింహం. సింహం జూలు విధిల్చిందంటే చాలు చుట్టుపక్కన ఉన్న జంతువులన్నీ పరుగు తీయాల్సిందే.. మరి అలాంటి సింహానికి ఓ ఏనుగు పిల్ల చుక్కలు చూపిస్తే ఎలా ఉంటుంది.
వినడానికి కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.. అవును నిజమే ఒకటి కాదు రెండు ఏకంగా 14 సింహాలకు ఓ ఏనుగు పిల్ల చుక్కలు చూపించింది. ఏనుగు పిల్ల దెబ్బకు సింహాలు కంగుతిన్నాయి.ఎక్కడో తెలియదు కాను దాదాపుగా అది అటవీ ప్రాంతమే. పక్కనే పెద్ద వాగు ప్రవహిస్తున్నది. అక్కడ ఓ ఏనుగు పిల్లపై ఉన్నట్టుండి దాదాపుగా 14 సింహాలు ఒక్క సారిగా మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆ ఏనుగు పిల్లను పూర్తిగా చుట్టుముట్టేశాయి. ఒక సింహమైతే ఏకంగా ఏనుగుపైకి ఎక్కి దానిని నేలకూల్చాలని ప్రయత్నించింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఏనుగు పిల్ల అని విధాలా ప్రయత్నించింది.
Viral Video : సింహాలను ముప్పుతిప్పలు పెట్టి..
కానీ 14 సింహాలు ఎటాక్ చేస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కడే వాటి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించింది. వాటిని అటూ ఇటూ తరుముతూ ముందుకు వెళ్తోంది. ఇక్కడ అప్పడే దానికి ఒక ఆలోచన వచ్చింది. నీటిలోకి వెళితే సింహాలు తనను వదిలిపెడతాయని భావించి పక్కనే ఉన్న వాగులోకి వెళ్తుండగా సింహాలు ఏనుగుపిల్లను విడవటం లేదు. ఇక కోపానిగి గురైన ఆ ఏనుగు పిల్ల నీటి నుంచి సింహాల వైపునకు ఒక్క సారీగా కోపంతో దూసుకువచ్చింది. వాటన్నింటిని అక్కడి నుంచి తరమేసింది. వాటికే చుక్కలు చూపించింది. తర్వాత ఆ నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంది.
Young Elephant survives attack by 14 Lions.???? pic.twitter.com/8x2SdUAXg3
— EYE CATCHING PLUS (@CatchingPlus) January 19, 2022