Viral Video : దాహంతో ఉన్న మ‌నిషికి నీళ్లు అందించిన ఏనుగు.. వీడియో చూసి అంద‌రు షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : దాహంతో ఉన్న మ‌నిషికి నీళ్లు అందించిన ఏనుగు.. వీడియో చూసి అంద‌రు షాక్

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : దాహంతో ఉన్న మ‌నిషికి నీళ్లు అందించిన ఏనుగు.. వీడియో చూసి అంద‌రు షాక్

Viral Video : ఏనుగుని చూడ‌గానే మ‌నం భ‌య‌బ్రాంతుల‌కి గుర‌వుతూ ఉండ‌డం స‌హ‌జం. దాని ఆకారం చూసే ఉలిక్కిప‌డుతుంటాం. అయితే మావటి వాడు మాత్రం కొన్ని ఏనుగులని ఊర్ల‌లో తిప్పుతూ అంద‌రికి ఉత్సాహాన్ని అందిస్తుంటాడు. ఏనుగు అడవిలో కెల్లా అతిపెద్ద శరీరం కలిగినది ఇదే. ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు తమ పాదాల కింద పడ్డది ఏదైనా సరే.. చూర్ణం చేసే స‌త్తా ఉంటుంది. దానికి ఆగ్రహం వస్తే చుట్టూ అంతా నాశనం చేయగలవు. కానీ, ఏనుగులు మనిషికి మంచి మిత్రులుగా ఉంటాయి. ఎందుకంటే.. ఏనుగులు తెలివైన జంతువులు అని అంటుంటారు. అడ‌విలో మెరుగ్గా ఉండే ఏనుగులు ఊర్ల‌లోకి వ‌స్తే భీబ‌త్సం సృష్టిస్తాయి.

Viral Video : దాహం తీర్చిన ఏనుగు..

ఏనుగులు జనవాసాల్లో చేరితే దాన్ని ఎదుర్కొవటం ఎవరి వల్ల కాదు..అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం మ‌నం చాలా చూశాం. అడవిలో కావాల్సిన ఆహారం దొరక్కపోవటంతో ఏనుగులు జనావాసంలోకి చొరబడి అన్నింటిని నాశ‌నం చేస్తున్నాయి. తొండంతో భీబ‌త్సం సృష్టిస్తుంది. అయితే తాజాగా ఓ ఏనుగు మనిషి దాహం తీర్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్క్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలో ఓ వ్యక్తి దాహం తీర్చేందుకు ఏనుగు తొండంతో హ్యాండ్ పంప్ కొట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ పార్కులోని గార్డు సుదీప్ ఏనుగు సాయంతో నీళ్లుతాగి దాహం తీర్చుకున్నాడు. అతడి దాహం తీర్చిన ఏనుగు రూపకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అక్కడి ఏనుగుల పార్కులో ప్రస్తుతం తొమ్మిది ఏనుగులు ఉన్నాయి. చుట్టు పక్కల నీటి వనరులు అంతరించిపోయినప్పుడు ఏనుగులు ఇలా హ్యాండ్ పంప్ కొడతాయని ఏనుగు క్యాంప్ నిర్వాహకులు చెప్పారు.ప్ర‌స్తుతం ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. మ‌నుషుల‌తో కొన్ని మూగ జీవాలు చాలా స‌న్నిహితంగా ఉంటూ వారికి క‌ష్టన‌ష్టాల‌లో అండ‌గా నిలుస్తున్నాయ‌ని చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది