Frank Video : ఫ్రాంక్ వీడియో చేయబోయి .. చివరికి రోడ్డు మీదే కొట్టుకున్న అమ్మాయి, అబ్బాయి .. వైరల్ వీడియో!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Frank Video : ఫ్రాంక్ వీడియో చేయబోయి .. చివరికి రోడ్డు మీదే కొట్టుకున్న అమ్మాయి, అబ్బాయి .. వైరల్ వీడియో!!

 Authored By aruna | The Telugu News | Updated on :20 October 2023,1:00 pm

Frank Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాకి జనాలలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్వింపజేసేలా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఫ్రాంక్ వీడియో చేయబోయి ఒక అమ్మాయి, అబ్బాయి రోడ్డు మీదే కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఫ్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ బ్లాగర్లు ఫ్రాంక్ వీడియోలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కువగా ఫ్రాంక్ వీడియోలను చేస్తుంటారు. వాటిల్లో కొన్ని అద్భుతంగా ఉండి అందరిని నవ్వింపజేసేలా ఉంటాయి. మరికొన్ని చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో ఫ్రాంక్ వీడియో షూట్ చేసే సమయంలో పెద్ద గొడవ జరిగింది. ఓ అమ్మాయి అబ్బాయి అందరి ముందే ఒకరినొకరు కొట్టుకున్నారు. అదంతా ఫేక్ అని కొందరు అంటుంటే, మరికొందరు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Girl boy Frank video vira

Girl boy Frank video vira

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి అబ్బాయి తో గొడవ పడుతుంది. ఇద్దరూ తీవ్రంగా వాదించుకుంటారు. ఈ క్రమంలోనే అమ్మాయి అబ్బాయిపై చేయి చేసుకుంది. దాంతో గొడవ పెద్దది అయింది. అబ్బాయి కూడా అమ్మాయిని చంప మీద కొట్టాడు. దాంతో ఆమె ఫోన్ తీసి ఎవరికో చెప్పడానికి ప్రయత్నించింది. ఆ ఘటన మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోను ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. ఈ గొడవ అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అని కొందరు, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేస్తే బాగుండేది అని మరికొందరు కామెంట్లు చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది