Viral Video : మేకను పెళ్లి చేసుకున్న యువకుడు.. అందుకోసమేనట
Married to a goat : టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఎంతో మంది మేధావులు ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నారు. చండ్రుడి పైకి కూడా మనుషులు వెళ్లి వస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చిటికెలో తెలుసుకునేంత టెక్నాలజీ మనముందు ఉంది. ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా ఎక్కడో ఒక చోట మూడనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు. అయితే సాధారణంగా వివాహం జరిపే ముందు వధూవరుల జాతకాలు కచ్చితంగా చూసే పెళ్లి నిశ్చయం చేసుకుంటారు. ఒక వేళ జాతకంలో దోషం ఉంది అని చేప్తే కొంత మంది పెళ్లి ముందు వింత ఆచారాలను కూడా పాటిస్తారు. అయితే ఓ యువకుడు తన దోష నివారణ కోసం ఏకంగా ఓ మేకను పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా ఈ వింత ఘటన కృష్టా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్ లో ఓ గుడిలో జరిగింది. అయితే ఆ యువకుడు జాతకాలు విపరీతంగా నమ్మడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఆ యువకుడి జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పారట. దీంతో జాతకాలపై గట్టి నమ్మకం ఉన్న ఆ యువకుడు మేకతో వివాహం చేసుకుంటే దోషం పోతుందని చెప్పడంతో పెళ్లికి అంగీకరించాడు. ఉగాది రోజున స్థానికంగా ఉండే నవగ్రహ ఆలయంలో సదరు యువకుడికి అర్చకుడు మేకతో వివాహం జరిపించాడు.
Married to a goat : మరీ ఇంత నమ్మాలా..
కాగా యువకుడు మేకను పెళ్లి చేస్తున్న దృశ్యాలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పలు విధాలుగా స్పందిస్తున్నారు. నమ్మకాలు ఉండొచ్చు కానీ మరీ ఈ విధంగా మూఢ నమ్మకాలుండటం సరైనది కాదని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరీ మేకతో పెళ్లి ఏంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.