నిజంగానే డబ్బులు చెట్లకు కాస్తున్నాయి .. ఈ వైరల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..!
డబ్బులు చెట్లకు కాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా .. ఈ ఫన్నీ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సాధారణంగా మన పెద్దలు చిన్నపిల్లలు డబ్బుల కోసం మారాం చేసినప్పుడు డబ్బులేం చెట్లకు కాయడం లేదు అని అంటుంటారు. కష్టపడి సంపాదిస్తే తప్ప చెట్టు నుంచి పండు తీసినంత ఈజీగా డబ్బులు రావు అని చెబుతుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. చెట్లకు డబ్బు కాస్తుందని చూపించే ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది చివరికి ఫ్రాంక్ వీడియో అని తెలిసి అందరూ నవ్వుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న చెట్టును కాలితో తన్నాడు. వెంటనే చెట్టు పైనుంచి కరెన్సీ నోట్లు కింద పడతాయి. దీంతో ఆ వ్యక్తి కాగితాలను ఏరుకొని మళ్లీ చెట్టును తన్నుతాడు. అప్పుడు కూడా డబ్బులు కింద పడతాయి. అయితే ఇదంతా పక్కనే ఉన్న ఓ వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. తాను కూడా ప్రయత్నించేందుకు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు కిందకు వెళ్లిన అతడు కాలితో చెట్టుని తన్నాడు. అయితే అతడి పై కరెన్సీ నోట్లకు బదులుగా బకెట్ తో విసిరిన నీళ్లు పడ్డాయి. దాంతో అది ఫ్రాంక్ వీడియో అని తెలుసుకుని కాస్త ఫీలయినట్లుగా కనిపించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ వీడియోకు మిలియన్స్ లలో వ్యూస్ వచ్చాయి. ఎనిమిది లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ లు చేశారు. పాపం తనపై కూడా డబ్బులు పడతాయని ఆశపడ్డాడు అని కొందరు, ఆశ మన వివేకాన్ని చంపేస్తుంది, ఎంత నిరాశ పడ్డాడో అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా వచ్చిన ఈ వీడియో కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram