Viral Video : పిల్లితోనే గేమ్సా.. పిల్లి తల మీద కూర్చొని గేమ్స్ ఆడిన ఎలుక.. వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పిల్లితోనే గేమ్సా.. పిల్లి తల మీద కూర్చొని గేమ్స్ ఆడిన ఎలుక.. వైరల్ వీడియో 

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 January 2022,6:15 am

Viral Video : పిల్లి, ఎలుక మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. తాతల కాలం నుంచి ఆ రెండింటికి అస్సలు పడదు. రెండూ ఎదురు పడితే చాలు.. ఇక పోట్లాడుకోవడమే. అయితే.. ఎప్పుడైనా సరే.. వీటి మధ్య జరిగే పోరాటంలో గెలుపు మాత్రం పిల్లిదే. ఎందుకంటే.. ఎలుక ఎంతుంటుంది చెప్పండి. పిల్లి ముందు కుప్పిగంతులు వేస్తే ఊరుకుంటుందా. అందులోనూ పిల్లికి ఎలుకలంటే మహా ప్రీతి. చికెన్ బిర్యానీ లాగా. అందుకే కాళ్ల కాడికి వచ్చే బిర్యానీని అదెందుకు కాదనుకుంటుంది.

మీకు ఇంకో విషయం తెలుసా? ఒక్కోసారి ఎలుకలు పిల్లులను కావాలని పరిగెత్తిస్తాయి కానీ దొరకవు. ఎందుకంటే.. ఎలుకలు ఎక్కడ రంధ్రం కనిపిస్తే అందులో దూరిపోతాయి. కానీ.. పిల్లికి ఆ చాన్స్ లేదు కదా. అందుకే.. అప్పుడప్పుడు పిల్లులతో గేమ్స్ ఆడుతుంటాయి ఎలుకలు.ఓ పిల్లి ఎలుకను చూసింది. అటు చూసి ఇటు చూసేలోగా ఎలుక మాయం అయిపోయింది. అదేంటి ఇప్పటి దాకా ఇక్కడే కదా ఉన్నది.

mouse and cat funny video goes viral

mouse and cat funny video goes viral

Viral Video : శాల్తీలు లేచిపోతాయి.. పిల్లిని చూసి ఎలుక ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ఇంతలోనే ఎక్కడికి పోయింది అని తెగ టెన్షన్ పడుతుంది పిల్లి. కానీ.. ఆ ఎలుక మాత్రం పిల్లి తల మీదే కూర్చుంది. తన తల మీదే ఎలుక ఉందని గమనించని పిల్లి అటూ ఇటూ చూస్తుంటుంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో.. ఇదేం ఎలుకరా బాబోయ్.. డైరెక్ట్ గా పిల్లీనే ఢీకొన్నది. ఏమాత్రం భయం లేకుండా పిల్లి తలమీదే కూర్చున్నది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/guldurbakalim/status/1478085576893083650?s=20

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది