Old Man : ఈ తాత చెప్పినట్టు చేస్తే.. వంద ఏళ్లు బ్రతకడం గ్యారంటీ .. వైరల్ అవుతున్న వీడియో!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Old Man : ఈ తాత చెప్పినట్టు చేస్తే.. వంద ఏళ్లు బ్రతకడం గ్యారంటీ .. వైరల్ అవుతున్న వీడియో!!

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Old Man : ఈ తాత చెప్పినట్టు చేస్తే.. వంద ఏళ్లు బ్రతకడం గ్యారంటీ ..

  •  తాత వీడియో వైరల్

Old Man : అప్పట్లో వ్యక్తులు చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవారు. పోషకాహారం తినడమే కాకుండా శారీరకంగా కూడా ఎక్కువగా శ్రమ పడేవారు. అందుకే ముసలితనంలో కూడా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కాలంతో పాటు ఆహారంలో జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫాస్ట్ ఫుడ్, నిల్వ ఉంచిన ఆహారం ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం ఇలా పలు కారణాలతో చిన్న వయసు లను చాలా మంది డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే గుండెపోటు వలన ఎంతోమంది చనిపోతున్నారు. అయితే 90 ఏళ్ల వయసులో కూడా యాక్టివా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలని

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు తన ఫిట్నెస్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో వ్యక్తి తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతను రోజు వ్యాయామం చేసేవాడట. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు యోగ చేసేవారట. చాలా త్వరగా అరిగిపోయే ఆహారాన్ని తినేవారట. నాన్ వెజ్ కూడా చాలా తక్కువగా తింటారట. ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించారట దీనివలన ఆయన ఆరోగ్యంగా ఉండేవారట.

ఈ వీడియో పై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వృద్ధుడు చెప్పిన దానికి డాక్టర్లు సైతం ఏకీభవిస్తున్నారు. తాత గారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు దాకా ఈ వైరల్ వీడియోను 3.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. మా అమ్మానాన్న వర్షం వచ్చినప్పుడు కూడా వాకింగ్ చేసేవారు. ఇద్దరు కూడా 85 ఏళ్లు బ్రతికారు. ఆహారం, వ్యాయామం విషయంలో చాలా క్రమశిక్షణ అవసరం. మా అమ్మమ్మ పొగాకు కాలుస్తారు. అయినా జీన్స్ కారణంగా ఆమె 90 ఏళ్ళు వచ్చిన ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు .

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది