Police CPR Snake : చనిపోతున్న పామును బ్రతికించిన పోలీస్ ఆఫీసర్ .. మెచ్చుకుంటున్న నెటిజన్లు .. వైరల్ వీడియో..
ప్రధానాంశాలు:
చనిపోతున్న పామును బ్రతికించిన పోలీస్ ఆఫీసర్
మెచ్చుకుంటున్న నెటిజన్లు .. వైరల్ వీడియో..
Police CPR Snake : సాధారణంగా ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే అతడికి సిపిఆర్ చేసి బ్రతికిస్తూ ఉండడం చాలానే చూసాం. ఈ సీపీఆర్ చేయడం వలన మనుషులు మాత్రమే బ్రతుకుతారు అనుకుంటాం కానీ పాములు కూడా బ్రతుకుతాయని ఇప్పుడే తెలిసింది. దీనికి సంబంధించిన న్యూస్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన వెళుతున్న దారిలో ఒక పాము క్రిమి సంహారకమందు కలిపి ఉన్న నీటిని త్రాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈ క్రమంలోని అది చూసిన పోలీస్ ఆఫీసర్ ఆ పాముకు సిపిఆర్ చేశాడు. అంటే పాము నోట్లో నోరు పెట్టి దానికి శ్వాస అందించాడు.
ఇక సిపిఆర్ ఎందుకు చేస్తారంటే ఒక మనిషికి ప్రమాదం జరిగినప్పుడు గుండె కొట్టుకోకుండా ఆగిపోయిన పరిస్థితిలో దానికి కృత్రిమంగా నోటి ద్వారా శ్వాసను అందించి చెస్ట్ పైన నొక్కుతూ ఉంటే ఆ గాలికి ఆగిపోయిన గుండె ఆక్టివేట్ అయ్యి మళ్లీ యధావిధిగా పనిచేస్తుంది. ఇలా చేయడం వలన మనిషి బ్రతకడం జరుగుతుంది. ఇలాంటి కేసులను మనం నిత్యం సోషల్ మీడియాలో, బయట చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ సీపీఆర్ అందించి దానిని బ్రతికించారు. దానికి స్పృహ రాగానే అక్కడ వదిలేసి రావడం జరిగింది.
ఈ ఘటన మొత్తాన్ని అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన చాలామంది సిపిఆర్ చేసి పామును బ్రతికించిన పోలీస్ ఆఫీసర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే మరికొంతమంది మాత్రం పాములతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే స్పృహలోకి వచ్చాక అది ఆయననే కాటేసే అవకాశం ఉంది అని జాగ్రత్తలు చెప్తూ మరోవైపు పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పోలీస్ ఆఫీసర్ పేరు అతుల్ శర్మ అని గుర్తించారు.