Viral Video : ఈ పామును చూసి మీరు నేర్చుకోవాల్సింది.. చాలా ఉందండోయ్..
Viral Video : జనరల్‌గా చాలా మంది పామును దేవతగా పూజిస్తుంటారు. కానీ, అదే పాము ఎక్కడైనా కనబడితే మాత్రం భయపడిపోతుంటారు. ఎక్కడ అది మన మీదకు వస్తుందేమోనని సందేహిస్తుంటారు. ఇకపోతే పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట హల్ చల్ అవుతోంది. ఇంతకీ సదరు వీడియోలో స్నేక్ ఏం చేస్తుందంటే..రూపిన్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్వీట్టర్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ పాము నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనే క్యాప్షన్‌తో వీడియో పోస్టు చేశారు ఐపీఎస్ ఆఫీసర్. వీడియోలో పాము అలా సునాయసంగా.. కొబ్బరి చెట్టు ఎక్కేస్తుంది. అలా తాడి చెట్టును ఎక్కే క్రమంలో తన బాడీని తానే సపోర్టుగా తీసుకుంది ఆ పాము.తన శరీరం ద్వారా పాకే పాము.. ఇక్కడ తాడి చెట్టును ఎక్కే క్రమంలో మొదలు తన ముఖ భాగం పైకి పెట్టిన తర్వాత తన బాడీని చుట్టు చుట్టినట్లుగా అలా చుట్టుకుంది. అలా సపోర్ట్ తీసుకుని మెల్లిమెల్లిగా పాము తాడి చెట్టు పైకి ఎక్కేస్తుంది.

snake video viral in social media
Viral Video : అలా సునాయసంగా.. తాడి చెట్టు ఎక్కేసిన స్నేక్..
అలా తన గమ్య స్థానానికి రీచ్ అయింది స్నేక్. ఈ పాము వీడియోను చూసి నెటిజన్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని రూపిన్ శర్మ పేర్కొన్నాడు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే కష్టపడి తమను తాము మలచుకోవాలనే సందే శం ఇందులో ఉంది. ఇకపోతే వీడియోలో పామును చూసి చాలా మంది నెటిజన్లు భయపడిపోతున్నారు. పాము తాడు మాదిరిగా చుట్టుకుని ముందకు సాగుతున్నదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.