Viral Video : కారు పార్కింగ్‌ చేసిన కుక్క.. చూసిన వారంతా షాక్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : కారు పార్కింగ్‌ చేసిన కుక్క.. చూసిన వారంతా షాక్..

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,7:00 pm

Viral Video : మనిషి రోజులో ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇందులో భయంపుట్టించే వీడియోలతో పాటు, హ్యాపీగా ఫీల్ అయ్యేవి, ఆశ్చర్యానికి గురిచేసే వీడియోలు చాలానే ఉంటాయి. ఈ కోవకు చెందిందే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వీడియో.. ఆ మూగ జీవి తన యనజమానికి ఎంత చక్కగా హెల్ప్ చేసిందో చూడండి.. దాన్ని చూసి మీరు కూడా ఫిదా కావాల్సిందే.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చేసే కొద్ది మళ్లీ చూడాలని అనిపిస్తుంటాయి. ఆ వీడియోలు అంతలా ఆకట్టుకుంటాయి. వీటిల్లో పెంపుడు జంతువులు చేసే విన్యాసాలు, పనులకు సంబంధించిన వీడియోలే ఎక్కువ.

Viral Video : కుక్క తెలిపి అదుర్స్

the dog who parked the car Viral Video

the dog who parked the car Viral Video

ఇలాంటి వీడియోనే తాజాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక కుక్క తన యజమాని కారును పార్క్ చేసే సందర్భంగా ఆయనకు హెల్ప్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కారు వెనక కూర్చొని పార్కింగ్ చేసేందుకు సూచనలు చేసింది. ముందు రెండు కాళ్లను పైకి ఎత్తి సైగలు చేస్తోంది. కుక్కు కాళ్లతో సైగలు చేస్తూ ఇందులో కనిపించింది. దీని సైగలు చూస్తే మనిషి చేతులతో సైడ్ చెబుతున్నట్టుగా అనిపిస్తోంది.

దాని సైగలను బట్టి ఆ ఓనర్ కారును పార్క్ చేశాడు. చివరకు కారును ఆపేయమని కుక్క సైగ చేయడంతో ఆయన కారును ఆపేశాడు. పెంపుడు జంతువులను పెంచుకుంటే అవి మనకి మేలు చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అని చెప్పడంలో ఈ కుక్క పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కుక్క తెలివితేటలను చూసి ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరూ ఓ సారి ఆ వీడియోపై లుక్కెయ్యండి. మీరు సైతం ఫిదా కాక తప్పదు మరి..

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది