తల్లిని చంపిన నాన్నకి న్యాయస్థానంలో నిలబెట్టి శిక్షపడేలా చేసిన కొడుకు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

తల్లిని చంపిన నాన్నకి న్యాయస్థానంలో నిలబెట్టి శిక్షపడేలా చేసిన కొడుకు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :28 July 2023,4:00 pm

ప్రస్తుత సమాజంలో ప్రేమానురాగాల కంటే కక్షలు.. పంతాలకు పోయి మనుషులు ప్రాణాలు తీసేస్తున్నారు. అది బయట వ్యక్తి అయినా కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా సరే.. మానవత్వంగా ఆలోచించకుండా అడవిలో మృగం మాదిరిగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఆఖరికి రక్తసంబందులను చివర ఆఖరికి కట్టుకున్న వ్యక్తులను సైతం పంతాలకు పోయి హత్యలు చేసేస్తున్నారు. సరిగ్గా ఈ రకంగానే భార్యను భర్త అతికిరాతకంగా చంపటంతో.. అది చూసిన లేత చిన్న వయసు కలిగిన కొడుకు పెద్దయ్యాక తండ్రికి శిక్ష పడేలా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పాడు.ఈ ఘటన ముంబైలో జరిగింది. భార్యను చంపిన ఘటనలో భర్తకు ముంబాయి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది.

కాగా సరైన సాక్ష్యం లేకపోవడంతో నిందితుడు తప్పించుకోవచ్చని భావించాడు. ఈ క్రమంలో సమాజానికి న్యాయస్థానాలకు తన కొడుకు మానసిక రోగి అని.. తండ్రి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కొడుకే తండ్రికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేసి తల్లికి న్యాయం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఉమేష్ అనే డెంటల్ వైద్యుడికి.. తనుజాతో 2009లో పెళ్లయింది. వీరిద్దరికీ కొడుకు కూడా జన్మించాడు. అయితే కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ప్రతిరోజు గొడవలు పడుతుండేవారు. అయితే ఒక రోజు గొడవ గట్టిగా జరగడంతో కొడుకుని తీసుకుని తనుజ పుట్టింటికి వెళ్ళిపోయింది.

the father who killed his mother son stand in the court and get punished

the father who killed his mother son stand in the court and get punished

ఆ తర్వాత ఉమేష్ భార్య తన తనూజ నీ ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రాకపోవటంతో.. భార్యపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2016 డిసెంబర్ 11వ తారీఖున.. తనూజా ఉంటున్న ఇంటికి వచ్చి 37 సార్లు కత్తితో పొడిచే అతి కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఉమేష్ లొంగిపోవడం జరిగింది. మధ్య జరుగుతున్న సమయంలో ఆ దంపతుల నాలుగేళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అయితే తన తండ్రి.. తల్లిని ఎలా హత్య చేశాడో కోర్టులో.. ఇటీవల పూసగుచ్చినట్లు చెప్పి శిక్షపడేలా చేశాడు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది