Viral Video : పిల్లిని ఏడిపించిన రామచిలుక.. వీడియో వైరల్..
Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆకట్టుకునే వీడియోలు చాలా తక్కువ. అలాంటి ఆకట్టుకునే వీడియోల్లో పెంపుడు జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వీడియోలు చేస్తున్నంత సేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం మన టెన్షన్‌లను మరిచిపోయి కాసేపు హ్యాపీగా నవ్వుకుంటాం. అలాంటి వీడియోలు ఎవరి కంట పడినా వెంటనే షేర్ చేస్తూ ఉంటారు. అలా అవి వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇందులో ఒక పక్షి, ఒక జంతువు చాలా ఫన్నీగా బిహేవ్ చేశాయి. ఇంతకీ అవి ఏం చేశాయో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో మీరు ఓ లుక్కెయ్యండి. ఓ ఇంట్లో పిల్లి, రామచిలుకలు కలిసి ఉంటున్నాయి. ఆ టైంలో రామ చిలుకకు ఓ ప్లాస్టిక్ కర్ర దొరికింది. దాని చివరకు తెల్లని ఆకారంలో ఏదో చుట్టి ఉంది.

the parrot that teased the cat Viral Video
Viral Video : కర్ర ఇవ్వకుండా..
ఇంకేముంది దానిని తీసుకునేందుకు పిల్లి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ కర్ర పిల్లికి దొరక్కుండా దానిని రామచిలుక కాసేపు ఆటపట్టించింది. చివరకు పిల్లి ఆ కర్రను దక్కించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ తెగ సంబర పడిపోతున్నారు. గుడ్ ఫ్రెండ్ షిప్ అని కామెంట్స్ పెడుతున్నారు.
https://twitter.com/Yoda4ever/status/1486179591093989376