Viral Video : రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే సూర్యుడు మండి పోతున్నాడు. మధ్యాహ్నం టైంలో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉంటె బెటర్ అని, అవసరమైతేనే బయటకు రావాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. అయితే మనుషులే తట్టుకోలేకపోతున్న ఈ ఎండలకు అడవుల్లో జీవించే జంతువులు, పక్షులు విలవిలలాడుతున్నాయి. నీళ్లు దొరక్కా నానాకష్టాలు పడుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం పల్లెటూర్లలో కోతులు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి.
వేసవి కాలం కావడంతో అడవుల్లో నీరు దొరకపోవడంతో ఆహారం లేక జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటే సంఘటనే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. బాగా దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నీళ్లు తాగించిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ్నీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ట్రాఫిక్ పోలీసు పేరు సంజయ్ ఘుడే అంటూ ట్విట్ చేశారు. కేవలం 30 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 71 వేలకు పైగా వీక్షించగా.. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసు మానవత్వానికి సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video : మీరు కూడా స్పందించండి
మూగజీవాల పట్ల మానవత్వం చాటుకున్న పోలీసుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో జనవాసాల్లోకి వచ్చిన అడవి జంతువులకు నీరు, ఆహారం అందించాలని కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా వీలైతే జంతువులు పక్షుల కోసం మీ ఇంటి ఆవరణలో.. పరిసర ప్రాంతాలలో నీళ్లను చిన్న చిన్న డబ్బాలలో ఏర్పాటు చేయండి. మీకు సాధ్యమైతే ఎంతో కొంత ఆహారం కూడా అందించే ప్రయత్నం చేయండి. మూగ జీవాలను మీ వంతుగా రక్షించండి.. బాధ్యతగా ఉండండి.
Traffic constable Sanjay Ghude.❤️
pic.twitter.com/riZfYdK35c— Awanish Sharan (@AwanishSharan) April 3, 2022