Viral Video : ట్రైన్ దిగే క్రమంలో తల్లి చేతిలో నుండి డ్రైనేజీలో పడిపోయిన ఆరు నెలల శిశువు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ట్రైన్ దిగే క్రమంలో తల్లి చేతిలో నుండి డ్రైనేజీలో పడిపోయిన ఆరు నెలల శిశువు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :21 July 2023,5:00 pm

Viral Video : ఈ లోకంలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదని అందరికీ తెలుసు. బిడ్డలను.. ఎటువంటి కల్మషం లేకుండా.. చూసుకునేది తల్లి. తాను తిన్న తినకపోయినా పిల్లల కడుపు నిండితే తన కడుపు నిండినట్లే.. అనే రీతిగా తల్లి తన ప్రేమను బిడ్డల పట్ల చాటుకుంటది. పిల్లలే తన లోకం అన్నట్టుగా తల్లి బ్రతుకుద్ది. నవ మాసాలు మోసి వెంటనే తర్వాత అందరికంటే ఎక్కువగా సంతోషించేది తల్లి.

ఇదిలా ఉంటే ఆరు నెలల శిశువు.. తల్లి చేతుల్లో నుండి జారీ డ్రైనేజీలో పడిపోయిన ఘటన ఇటీవల ముంబై లోకల్ ట్రైన్ లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే ముంబై లోకల్ ట్రైన్ ఆగిపోవడంతో యోగిత అనే యువతి.. తన ఆరు నెలల పాప రిషికతో ట్రాక్ మీద నడుస్తుండగా.. పట్టు తప్పి 6 నెలల చిన్నారి రిషిక డ్రైనేజీలో పడిపోయింది. దీంతో ట్రైన్ చాలాసేపు ఆపేసి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం అధికారులు ఎంతగానో తనిఖీలు చేపట్టారు. ట్రైన్లో పాసింజర్లు సైతం ఆ డ్రైనేజీ లోతులో ఉండటంతో.

video of 6 month old baby falling from mothers hand into drainage

video of 6 month old baby falling from mothers hand into drainage

ఎవరికి వారు చిన్నారిని కాపాడటానికి తమ వంతు శ్రమించారు. ఈ క్రమంలో తన ఆరు నెలల శిశువు డ్రైనేజీలో కొట్టుకుపోయిన ప్రదేశంలో తల్లి యోగిత తల్లడిల్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది