Viral Video : దీని వేషాలు మామూలుగా లేవుగా…ఈ శునకాన్ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : దీని వేషాలు మామూలుగా లేవుగా…ఈ శునకాన్ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే…

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంది. మరికొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని వీడియోలు మనకు అవగాహన కల్పిస్తాయి. అయితే ఈ వీడియోని చూస్తే అవాక్కావాల్సిందే. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన పేపర్ చదువుతాం. కానీ జంతువులు తన కళ్ళతో చూడడం తప్ప పుస్తకాలు పేపర్లు చదవలేవు. కానీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం పేపర్ చదువుతుంది. ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,8:00 am

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంది. మరికొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని వీడియోలు మనకు అవగాహన కల్పిస్తాయి. అయితే ఈ వీడియోని చూస్తే అవాక్కావాల్సిందే. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన పేపర్ చదువుతాం. కానీ జంతువులు తన కళ్ళతో చూడడం తప్ప పుస్తకాలు పేపర్లు చదవలేవు. కానీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం పేపర్ చదువుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా ఆ శునకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు మనుషులే కాదు, కుక్కలు కూడా పేపర్ చదవగలవా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా పేపర్ చదువుతున్న ఈ శునకం డ్రెస్ స్టైల్ కూడా అదిరిపోతుంది. ఒక సోఫాలో కూర్చొని, తెల్లటి చొక్కా, కళ్లద్దాలు పెట్టుకొని పేపర్ చదువుతూ స్టిల్ ఇవ్వగా దాని యజమాని ఈ శునకం చేసే విన్యాసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Viral Video A Dog Named Shunakam Reading News Paper

Viral Video A Dog Named Shunakam Reading News Paper

గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ శునకం న్యూస్ పేపర్ ని తన కాళ్ళ సాయంతో పట్టుకొని ఎంతో ఏకాగ్రతతో పేపర్ ను చదువుతుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా తమ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మంచి బాలుడు వార్తలు చదువుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. పిల్లాడు చదువుకుంటున్నాడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఓ మై గాడ్ ఎవరైనా చదివేటప్పుడు కళ్ళు రెప్పలు వేస్తారు ఈ శునకం మాత్రం కళ్ళు రెప్ప ఆర్పడం లేదంటూ ఈ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది